యీతఁడు దయగలఁడు యెప్పుడును నీమీఁద
(॥పల్లవి॥)
యీతఁడు దయగలఁడు యెప్పుడును నీమీఁద
చేతులార నీకు నీవే సేవ లెల్లాఁ జేయవే
(॥॥)
యిచ్చక మాడితేఁ జాలు నెదురు మాటాడ వచ్చు
వచ్చి దేర సతికి నీ పతితోను
చెచ్చెర మొక్కితేఁ జాలు సేఁత లన్నీఁ జేయవచ్చు
యిచ్చట నితనికేఁగా నేఁటికి లోఁగేవే
(॥॥)
చెంది నవ్వితేఁ జాలు చెనకులు నించవచ్చు
మందలించి వనితకు మగనితోను
పొందులు సేసితేఁ జాలు బొమ్మలఁ జంకించ వచ్చు
అందరిముందరా నేల అనుమానించేవే
(॥॥)
ప్రియము చెప్పితేఁ జాలు బిగ్గెఁ గౌఁగిలించవచ్చు
నయగారికాంతకు నాథునితోను
దయ నలమేల్మంగ నితఁడు శ్రీ వేంకటేశుఁడు
క్రియతోఁ గూడె నింక జయ మయ్యె నిపుడూ.
(||pallavi||)
yīdam̐ḍu dayagalam̐ḍu yĕppuḍunu nīmīm̐da
sedulāra nīgu nīve seva lĕllām̐ jeyave
(||||)
yichchaga māḍidem̐ jālu nĕduru māḍāḍa vachchu
vachchi dera sadigi nī padidonu
sĕchchĕra mŏkkidem̐ jālu sem̐ta lannīm̐ jeyavachchu
yichchaḍa nidanigem̐gā nem̐ṭigi lom̐geve
(||||)
sĕṁdi navvidem̐ jālu sĕnagulu niṁchavachchu
maṁdaliṁchi vanidagu maganidonu
pŏṁdulu sesidem̐ jālu bŏmmalam̐ jaṁkiṁcha vachchu
aṁdarimuṁdarā nela anumāniṁcheve
(||||)
priyamu sĕppidem̐ jālu biggĕm̐ gaum̐giliṁchavachchu
nayagārigāṁtagu nāthunidonu
daya nalamelmaṁga nidam̐ḍu śhrī veṁkaḍeśhum̐ḍu
kriyadom̐ gūḍĕ niṁka jaya mayyĕ nibuḍū.