యీపాటికి పాటియేరా నీవు నే
(॥పల్లవి॥)
యీపాటికి పాటియేరా నీవు నే-
నేపున మితి మీరితి నిఁక నెంత సేతువో
(॥॥)
మంకుదనమున నొక్కమాట నీతో నాడితేను
కొంకక అదొక పెద్ద కొండ సేసేవు
జంకించి నిన్నుఁ గనక చలమునఁ దిట్టితేను
అంకెలఁ బేరిచి పేర్చి అపుడెంత సేతువో
(॥॥)
చెనక రాఁగా నిన్నుఁ జేయి వట్టి నిలిపితే
కినిసి యిందరినీ సాకిరి వెట్టేవూ
పెనఁగి నిన్నుఁ గనక బెందుపడఁ జేసితేను
మనసు కాంతాళముతో మరి యెంత సేతువో
(॥॥)
రతివేళ నీతోను రాజసాన నుండితేను
తతిఁ గాఁక రేఁగి రేఁగి తమకించేవు
యితవై నన్నుఁ గనక యెలయించి నవ్వితేను
సతమై శ్రీ వేంకటేశ నట లెంత సేతువో.
(||pallavi||)
yībāḍigi pāḍiyerā nīvu ne-
nebuna midi mīridi nim̐ka nĕṁta seduvo
(||||)
maṁkudanamuna nŏkkamāḍa nīdo nāḍidenu
kŏṁkaga adŏga pĕdda kŏṁḍa sesevu
jaṁkiṁchi ninnum̐ ganaga salamunam̐ diṭṭidenu
aṁkĕlam̐ berisi persi abuḍĕṁta seduvo
(||||)
sĕnaga rām̐gā ninnum̐ jeyi vaṭṭi nilibide
kinisi yiṁdarinī sāgiri vĕṭṭevū
pĕnam̐gi ninnum̐ ganaga bĕṁdubaḍam̐ jesidenu
manasu kāṁtāḽamudo mari yĕṁta seduvo
(||||)
radiveḽa nīdonu rājasāna nuṁḍidenu
tadim̐ gām̐ka rem̐gi rem̐gi tamagiṁchevu
yidavai nannum̐ ganaga yĕlayiṁchi navvidenu
sadamai śhrī veṁkaḍeśha naḍa lĕṁta seduvo.