Yee sadigi neege tagu nee veduga

యీ సతికి నీకే తగు నీ వేడుక
Language

(॥పల్లవి॥)
యీ సతికి నీకే తగు నీ వేడుక
రాసి కెక్క పానుపుపై రచనలే వేడుక

(॥॥)
వెక్కసపు రతులలో వినయమే వేడుక
పిక్కటిల్లుఁ దిట్ల వోరుపే వేడుక
మక్కువ సరసాలలో మంచిమాటలే వేడుక
చొక్కపు టాసలలో చూపులే వేడుకలు

(॥॥)
సందుసుడి సన్నలలో జంకెనలే వేడుక
పొందు లై నందులో పిలుపులే వేడుక
యెందుఁ దరి తీపులో యెడమాటలే వేడుక
చిందేటి నవ్వులలో సిగ్గులే వేడుక

(॥॥)
జవ్వన మదములలో చలములే వేడుక
రవ్వ కౌఁగిటిలో తత్తరమే వేడుక
యివ్వల శ్రీ వేంకటేశ యింతి నిట్టే యేలితివి
మువ్వంక నింక మీలో ముచ్చటలే వేడుక

(||pallavi||)
yī sadigi nīge tagu nī veḍuga
rāsi kĕkka pānububai rasanale veḍuga

(||||)
vĕkkasabu radulalo vinayame veḍuga
pikkaḍillum̐ diṭla vorube veḍuga
makkuva sarasālalo maṁchimāḍale veḍuga
sŏkkabu ṭāsalalo sūbule veḍugalu

(||||)
saṁdusuḍi sannalalo jaṁkĕnale veḍuga
pŏṁdu lai naṁdulo pilubule veḍuga
yĕṁdum̐ dari tībulo yĕḍamāḍale veḍuga
siṁdeḍi navvulalo siggule veḍuga

(||||)
javvana madamulalo salamule veḍuga
ravva kaum̐giḍilo tattarame veḍuga
yivvala śhrī veṁkaḍeśha yiṁti niṭṭe yelidivi
muvvaṁka niṁka mīlo muchchaḍale veḍuga