యీ రమణి చెలువము యేమని పొగడవచ్చు
(॥పల్లవి॥)
యీ రమణి చెలువము యేమని పొగడవచ్చు
తేరకొన విభునికి దినబోగాలాయను
(॥॥)
సరవి నింతి ముఖ చంద్రోదయమై యుండఁగా
గరిమ నవ్వు వెన్నెల గాయఁగాను
సొరిది మోవి కెంపులే చుక్కలు గాయఁగాను
యిరవై వొక వంక నిదే రేతి రాయను
(॥॥)
సుదతి వజ్రాల బొట్టు సూర్యోదయమై వుండఁగా
యెదుటఁ గను మెఱుఁగు లెండ గాయఁగా
వుదుటుంగర కమలాలున్నతిఁ జెలఁగఁగాను
అదనఁ బట్ట పగ లాయ నొకవంకను
(॥॥)
మెలఁత నెఱిఁ దురుము మేఘోదయమై వుండఁగా
నెలమిఁ జెమట వాన లెసఁగఁగాను
అలమేలుమంగ యీకె ఆతఁడు శ్రీ వేంకటేశుఁ
డిలపైఁ గూడఁగా సొమ్ములీపె వంకనాయను
(||pallavi||)
yī ramaṇi sĕluvamu yemani pŏgaḍavachchu
teragŏna vibhunigi dinabogālāyanu
(||||)
saravi niṁti mukha saṁdrodayamai yuṁḍam̐gā
garima navvu vĕnnĕla gāyam̐gānu
sŏridi movi kĕṁpule sukkalu gāyam̐gānu
yiravai vŏga vaṁka nide redi rāyanu
(||||)
sudadi vajrāla bŏṭṭu sūryodayamai vuṁḍam̐gā
yĕduḍam̐ ganu mĕṟum̐gu lĕṁḍa gāyam̐gā
vuduḍuṁgara kamalālunnadim̐ jĕlam̐gam̐gānu
adanam̐ baṭṭa paga lāya nŏgavaṁkanu
(||||)
mĕlam̐ta nĕṟim̐ durumu meghodayamai vuṁḍam̐gā
nĕlamim̐ jĕmaḍa vāna lĕsam̐gam̐gānu
alamelumaṁga yīgĕ ādam̐ḍu śhrī veṁkaḍeśhum̐
ḍilabaim̐ gūḍam̐gā sŏmmulībĕ vaṁkanāyanu