యెటువంటి యాగడీఁడే యీ కృష్ణుఁడు
(॥పల్లవి॥)
యెటువంటి యాగడీఁడే యీ కృష్ణుఁడు
జొటజొటఁ గారఁగానే జుఱ్ఱీ మీఁగడలు
(॥॥)
కొట్టేఁ గృష్ణుఁడు వాఁడె కోలలెత్తి వుట్లపై
దట్టముగ గొల్లెతలు దాఁచిన పాలు
చుట్టిన చక్కిలములు చొక్కపు నురుగులునుఁ
బెట్టిన కాఁగులతోనే పెంచులుగఁజేసీనే
(॥॥)
దొంతులు దించి దించి దొరకొనీ కృష్ణుఁడు
బంతిఁ జక్కెర వెట్టీ గోపాలుల కెల్ల
మంతనాన వద్దని మానుపఁబోతేఁదాను
కొంత వారి నోరఁ బెరుగులు చమరీనే
(॥॥)
వీదు లెల్లఁ దానె శ్రీ వేంకటాద్రికృష్ణుఁడు
ఆదిగొని మెసగీని యడుకు లెల్ల
కాదని పెనఁగితేను కౌఁగిలించి గొల్లెతల
సోదించి కుచములంటి సొంపు గాఁగూడీనే
(||pallavi||)
yĕḍuvaṁṭi yāgaḍīm̐ḍe yī kṛṣhṇum̐ḍu
jŏḍajŏḍam̐ gāram̐gāne juṭrī mīm̐gaḍalu
(||||)
kŏṭṭem̐ gṛṣhṇum̐ḍu vām̐ḍĕ kolalĕtti vuṭlabai
daṭṭamuga gŏllĕdalu dām̐sina pālu
suṭṭina sakkilamulu sŏkkabu nurugulunum̐
bĕṭṭina kām̐guladone pĕṁchulugam̐jesīne
(||||)
dŏṁtulu diṁchi diṁchi dŏragŏnī kṛṣhṇum̐ḍu
baṁtim̐ jakkĕra vĕṭṭī gobālula kĕlla
maṁtanāna vaddani mānubam̐bodem̐dānu
kŏṁta vāri noram̐ bĕrugulu samarīne
(||||)
vīdu lĕllam̐ dānĕ śhrī veṁkaḍādrikṛṣhṇum̐ḍu
ādigŏni mĕsagīni yaḍugu lĕlla
kādani pĕnam̐gidenu kaum̐giliṁchi gŏllĕdala
sodiṁchi kusamulaṁṭi sŏṁpu gām̐gūḍīne