Yeduvamti vedugalo yiddarigini

యెటువంటి వేడుకలో యిద్దరికిని
Language

(॥పల్లవి॥)
యెటువంటి వేడుకలో యిద్దరికిని
తటుకన మీ కతలు తరితీపులయ్యా

(॥॥)
కలువ రేకుల వంటి కన్నుల నీవు చూచితే
చెలి యాల సిగ్గువడెఁ జెప్పవయ్యా
సెలవులఁ గొంత కొంత చిఱునవ్వు నవ్వితేను
మొలక చన్నులేల మూసుకొనే నయ్యా

(॥॥)
పరువాన పూబంతి పరిమళము చూచితే
శిరసేల వంచెఁ దాను చెప్పవయ్యా
సిరుల పంజరములో చిలుకతో మాటాడితే
పరాకు సేసుక తాను భావించ నేలయ్యా

(॥॥)
సముకాన నుండి నీవు సారె సింగారించుకొంటే
చెమరించఁ దనకేల చెప్పవయ్యా
అమర మమ్మేలితివి అన్నిటా శ్రీవేంకటేశ
రమణి యెన్నఁడు నీతో రతిఁగూడీనయ్యా

(||pallavi||)
yĕḍuvaṁṭi veḍugalo yiddarigini
taḍugana mī kadalu taridībulayyā

(||||)
kaluva regula vaṁṭi kannula nīvu sūside
sĕli yāla sigguvaḍĕm̐ jĕppavayyā
sĕlavulam̐ gŏṁta kŏṁta siṟunavvu navvidenu
mŏlaga sannulela mūsugŏne nayyā

(||||)
paruvāna pūbaṁti parimaḽamu sūside
śhirasela vaṁchĕm̐ dānu sĕppavayyā
sirula paṁjaramulo silugado māḍāḍide
parāgu sesuga tānu bhāviṁcha nelayyā

(||||)
samugāna nuṁḍi nīvu sārĕ siṁgāriṁchugŏṁṭe
sĕmariṁcham̐ danagela sĕppavayyā
amara mammelidivi anniḍā śhrīveṁkaḍeśha
ramaṇi yĕnnam̐ḍu nīdo radim̐gūḍīnayyā