Yeduvalem jesinaanu yinniyu namarunu

యెటువలెఁ జేసినాను యిన్నియు నమరును
Language

(॥పల్లవి॥)
యెటువలెఁ జేసినాను యిన్నియు నమరును
సట లొద్దనరే తాను సరసుఁ డిన్నిటను

(॥॥)
తగ వెఱిఁ గినవాఁ డు తనకు బుద్ది చెప్పేమా
మగువల మింతే మేము మమ్మడిగిన
యెగ సక్కేలకుఁ దాను యేమేమి సేసినాను
తగు ననరే దొరతన మెల్లఁ దనదే

(॥॥)
సత్తువలఁదా నెక్కుడు సాములు నేము నేర్పేమా
కొత్త పెండ్లి కూఁతులము కొచ్చి చూచినా
బిత్తరపు వాఁడు తాను బిరు దెంత నెఱపినా
చిత్తము కొల దనరే చేఁతలు నేరుచును

(॥॥)
అన్నిటా దేవుఁడు తాను ఆయములు నే మంటేమా
కన్నెలము నేము తన్నుఁ గరఁగించేమా
సన్న లేల సేసెనే తా జాణ శ్రీ వేంకటేశుఁడు
మన్నించు మనవే తాను మతకారి వాఁడు

(||pallavi||)
yĕḍuvalĕm̐ jesinānu yinniyu namarunu
saḍa lŏddanare tānu sarasum̐ ḍinniḍanu

(||||)
taga vĕṟim̐ ginavām̐ ḍu tanagu buddi sĕppemā
maguvala miṁte memu mammaḍigina
yĕga sakkelagum̐ dānu yememi sesinānu
tagu nanare dŏradana mĕllam̐ danade

(||||)
sattuvalam̐dā nĕkkuḍu sāmulu nemu nerbemā
kŏtta pĕṁḍli kūm̐tulamu kŏchchi sūsinā
bittarabu vām̐ḍu tānu biru dĕṁta nĕṟabinā
sittamu kŏla danare sem̐talu nerusunu

(||||)
anniḍā devum̐ḍu tānu āyamulu ne maṁṭemā
kannĕlamu nemu tannum̐ garam̐giṁchemā
sanna lela sesĕne tā jāṇa śhrī veṁkaḍeśhum̐ḍu
manniṁchu manave tānu madagāri vām̐ḍu