(॥పల్లవి॥)
యేది నీ జాణతన మిందులోనను
సోదించి నీ యెమ్మె నన్ను సూడు వట్టీనా
(॥॥)
చేరి నీవు రాఁగాను సిగ్గువడి వొదిగితే
ఆ రీతి నూరకే తిట్టేవమ్మ మీఁదను
మారుకు మారు నిన్నంటే మరి యేమి సేసేవు
రాజసము మా పయి నెపము వేసీనా
(॥॥)
ముప్పిరి నీవు చూడఁ గా ముసుఁ గు నేఁ బెట్టుకొంటే
వొప్పుగఁ బూవుల వేసె వొళ్ళు దాఁకను
అప్పటి నే నిమ్మపంట నట్టే నిన్ను వేసితేను
కప్పి నీ నేరుపు నాపై ఘాత సేసీనా
(॥॥)
నెట్టన నీవు పైకోఁగా నివ్వెరగుతో నుండితే
వొట్టి మదన ముద్రలు వొళ్ళ నించితి
గుట్టుతో శ్రీ వేంకటేశ కూడితి నేనే నిన్ను
దిట్ట నీ నవ్వులు మమ్ము దిమ్ము రేచీనా.
(||pallavi||)
yedi nī jāṇadana miṁdulonanu
sodiṁchi nī yĕmmĕ nannu sūḍu vaṭṭīnā
(||||)
seri nīvu rām̐gānu sigguvaḍi vŏdigide
ā rīdi nūrage tiṭṭevamma mīm̐danu
mārugu māru ninnaṁṭe mari yemi sesevu
rājasamu mā payi nĕbamu vesīnā
(||||)
muppiri nīvu sūḍam̐ gā musum̐ gu nem̐ bĕṭṭugŏṁṭe
vŏppugam̐ būvula vesĕ vŏḽḽu dām̐kanu
appaḍi ne nimmabaṁṭa naṭṭe ninnu vesidenu
kappi nī nerubu nābai ghāda sesīnā
(||||)
nĕṭṭana nīvu paigom̐gā nivvĕragudo nuṁḍide
vŏṭṭi madana mudralu vŏḽḽa niṁchidi
guṭṭudo śhrī veṁkaḍeśha kūḍidi nene ninnu
diṭṭa nī navvulu mammu dimmu resīnā.