(॥పల్లవి॥)
యెడమాటల పను లిఁక నేలా
చిడిముడి నవ్వులఁ జిమ్మీ వలపూ
(॥॥)
మనసులోని తన మర్మపు తలఁపులు
కనుఁగొనఁ దెలిపేఁ గామిని
తనువునఁ గలిగిన తమకములన్నియు
వినయము లోననే వివరించీని
(॥॥)
చొక్కమైన తన చుట్టరికంబులు
మొక్కులలోనే ముంచీని
వెక్కసంపుఁ దన వేడుక లెల్లను
జక్కవ చన్నుల సరిఁజూపీని
(॥॥)
కైకొను నీ రతిఁ గలసేటి కాంక్షలు
చే కానుకలనే చెప్పీని
జోక శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగ
నీకౌఁగిటిలో నెరపీని
(||pallavi||)
yĕḍamāḍala panu lim̐ka nelā
siḍimuḍi navvulam̐ jimmī valabū
(||||)
manasuloni tana marmabu talam̐pulu
kanum̐gŏnam̐ dĕlibem̐ gāmini
tanuvunam̐ galigina tamagamulanniyu
vinayamu lonane vivariṁchīni
(||||)
sŏkkamaina tana suṭṭarigaṁbulu
mŏkkulalone muṁchīni
vĕkkasaṁpum̐ dana veḍuga lĕllanu
jakkava sannula sarim̐jūbīni
(||||)
kaigŏnu nī radim̐ galaseḍi kāṁkṣhalu
se kānugalane sĕppīni
joga śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁga
nīgaum̐giḍilo nĕrabīni