యెడమాట లిఁక నేల యెనసిన పనులకు
(॥పల్లవి॥)
యెడమాట లిఁక నేల యెనసిన పనులకు
గుడిగొన్న మీ లోని కోరికె వీడేరెనూ
(॥॥)
వాలిక మోము వంచి వనిత నీకు మొక్కఁగా
కేల నెత్తి నీ విట్టే కౌఁగిట నించేవూ
మేలువారే మీ రిద్దరు మేను మేనుఁసోఁకెఁ గాన
తాలిమితో మీలోని తలఁపు లీడేరెను
(॥॥)
తేనె గారే మోవి యెత్తి తెఱవ మాఁటాడితేను
ఆనుక తమ్ముల మిడి యాదరించేవూ
వూనిన జాణలే మీరు వొకరొకరిఁ జూచితే
పూనుకొన్న పొందు లీడేరెను
(॥॥)
చిగురుఁ జేతులు చాఁచి చెలి నీ పాదా లొత్తితే
వొగిఁ జన్ను లంట రతి నోల లార్చేవూ
తగు నాకెకు నీకీ చేఁతలు
అగపడ్డ మీరతుల యాఁకట లీడేరెనూ
(||pallavi||)
yĕḍamāḍa lim̐ka nela yĕnasina panulagu
guḍigŏnna mī loni korigĕ vīḍerĕnū
(||||)
vāliga momu vaṁchi vanida nīgu mŏkkam̐gā
kela nĕtti nī viṭṭe kaum̐giḍa niṁchevū
meluvāre mī riddaru menu menum̐som̐kĕm̐ gāna
tālimido mīloni talam̐pu līḍerĕnu
(||||)
tenĕ gāre movi yĕtti tĕṟava mām̐ṭāḍidenu
ānuga tammula miḍi yādariṁchevū
vūnina jāṇale mīru vŏgarŏgarim̐ jūside
pūnugŏnna pŏṁdu līḍerĕnu
(||||)
sigurum̐ jedulu sām̐si sĕli nī pādā lŏttide
vŏgim̐ jannu laṁṭa radi nola lārsevū
tagu nāgĕgu nīgī sem̐talu
agabaḍḍa mīradula yām̐kaḍa līḍerĕnū