Yedamaada lemdaamka nemidigini

యెడమాట లెందాఁక నేమిటికిని
Language

(॥పల్లవి॥)
యెడమాట లెందాఁక నేమిటికిని
బడివాయకుండితేను ఫల మీడేరీని

(॥॥)
భావించుకొనినఁ గాని పల్ల వించదు మనసు
కైవసమైనఁ గాని కాంక్ష దీరదు
మోవఁ బెనఁగినఁ గాని మొనయవు వేడుకలు
రావే వో చెలియా రమణుని కడకు

(॥॥)
మొగము చూచినఁగాని మోహములు దెలియవు
నగినఁగాని తలఁపు నాఁటు కొనదు
తగిలి పిల్చినఁ గాని తనివోదు తమకము
మగువ నీ విఁక రావే మన్నించీ నీవిభుఁడు

(॥॥)
సరస మాడినఁ గాని చవి వుట్టదు కూటమి
వొరసినఁ గాని పంత మొనగూడదు
యిరవై శ్రీ వేంకటేశుఁడింతలోనే నిన్ను నేలే
మరిగి యిట్టే రావే మది నుబ్బీ నితఁడూ

(||pallavi||)
yĕḍamāḍa lĕṁdām̐ka nemiḍigini
baḍivāyaguṁḍidenu phala mīḍerīni

(||||)
bhāviṁchugŏninam̐ gāni palla viṁchadu manasu
kaivasamainam̐ gāni kāṁkṣha dīradu
movam̐ bĕnam̐ginam̐ gāni mŏnayavu veḍugalu
rāve vo sĕliyā ramaṇuni kaḍagu

(||||)
mŏgamu sūsinam̐gāni mohamulu dĕliyavu
naginam̐gāni talam̐pu nām̐ṭu kŏnadu
tagili pilsinam̐ gāni tanivodu tamagamu
maguva nī vim̐ka rāve manniṁchī nīvibhum̐ḍu

(||||)
sarasa māḍinam̐ gāni savi vuṭṭadu kūḍami
vŏrasinam̐ gāni paṁta mŏnagūḍadu
yiravai śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone ninnu nele
marigi yiṭṭe rāve madi nubbī nidam̐ḍū