యెడమాట లాడించే నెందాఁకాను
(॥పల్లవి॥)
యెడమాట లాడించే నెందాఁకాను
వుడివోని మచ్చికతో నున్నదాన ననవే
(॥॥)
తానే గతి యనేదాన దయ గోరు కున్నదాన
వీనులఁ దనకతలే వింటా నున్నదా
మానరాని పొందుదాన మానాపతిదానను
నా నా విధముల విన్నప మిదేయనవే
(॥॥)
మొక్కుతాను వున్నదాన మోహించి యున్నదాన
చెక్కుచేతఁ దనరప చింతించేదాన
యిక్కువనే వున్నదాన యెదురు చూచేదానను
మిక్కిలియాసతోడ నమ్మి యున్నదాన ననవే
(॥॥)
తగుల మిగల దాన తమకించి యున్నదాన
మగటిమితోఁ దన మన్ననదాన
జిగి నింతలోఁ దా వచ్చి శ్రీ వేంకటేశుఁడు గూడె
జగములోఁ దనకు నేఁ జనవరి ననవే
(||pallavi||)
yĕḍamāḍa lāḍiṁche nĕṁdām̐kānu
vuḍivoni machchigado nunnadāna nanave
(||||)
tāne gadi yanedāna daya goru kunnadāna
vīnulam̐ danagadale viṁṭā nunnadā
mānarāni pŏṁdudāna mānābadidānanu
nā nā vidhamula vinnaba mideyanave
(||||)
mŏkkudānu vunnadāna mohiṁchi yunnadāna
sĕkkusedam̐ danaraba siṁtiṁchedāna
yikkuvane vunnadāna yĕduru sūsedānanu
mikkiliyāsadoḍa nammi yunnadāna nanave
(||||)
tagula migala dāna tamagiṁchi yunnadāna
magaḍimidom̐ dana mannanadāna
jigi niṁtalom̐ dā vachchi śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
jagamulom̐ danagu nem̐ janavari nanave