యేడ కేడ నా గుణ మెఱఁగనివాఁడవా
(॥పల్లవి॥)
యేడ కేడ నా గుణ మెఱఁగనివాఁడవా
యీడు వెట్టుకొనేనంటే నెంతదాన నేను
(॥॥)
వల పెఱిఁగి నీవే వచ్చి నన్నేలుట గాక
పిలిపంచఁ గలనా పెను దొరవు
తలఁపు దెలిసి మాట తగ నీ వాడుట గాక
పలికించ నోపుదునా పంతగాఁడవూ
(॥॥)
వొడఁబాటు దలఁచుక వొగి నన్నేలుదు గాక
వొడి వట్టవచ్చునా వున్నతుఁడవు
బడలిక చూచి నీవే పైకొని కూడుదు గాక
అడుగఁ దగవా కౌఁగిలప్పుడే నిన్నును
(॥॥)
సేవ సేయఁగాఁ జూచి సేసలు వెట్టేవు గాక
వావి చెప్పుకో వసమా దేవుఁడవూ
శ్రీ వేంకటేశ నీవే చేకొని పెండ్లాడితివి
భావించ నాకుఁ దరమా పంతగాఁడవూ
(||pallavi||)
yeḍa keḍa nā guṇa mĕṟam̐ganivām̐ḍavā
yīḍu vĕṭṭugŏnenaṁṭe nĕṁtadāna nenu
(||||)
vala pĕṟim̐gi nīve vachchi nanneluḍa gāga
pilibaṁcham̐ galanā pĕnu dŏravu
talam̐pu dĕlisi māḍa taga nī vāḍuḍa gāga
paligiṁcha nobudunā paṁtagām̐ḍavū
(||||)
vŏḍam̐bāḍu dalam̐suga vŏgi nanneludu gāga
vŏḍi vaṭṭavachchunā vunnadum̐ḍavu
baḍaliga sūsi nīve paigŏni kūḍudu gāga
aḍugam̐ dagavā kaum̐gilappuḍe ninnunu
(||||)
seva seyam̐gām̐ jūsi sesalu vĕṭṭevu gāga
vāvi sĕppugo vasamā devum̐ḍavū
śhrī veṁkaḍeśha nīve segŏni pĕṁḍlāḍidivi
bhāviṁcha nāgum̐ daramā paṁtagām̐ḍavū