Yechchariga deva neegu nekkada paraagu

యెచ్చరిక దేవ నీకు నెక్కడ పరాకు
Language

(॥పల్లవి॥)
యెచ్చరిక దేవ నీకు నెక్కడ పరాకు
మచ్చిక నీమీఁద వేమారుఁ జల్లీని

(॥॥)
చెలి నీ యెదుట నదె చిత్తగించు మిప్పు డిట్టే
మలసి సొలసి నీతో మాటలాడీని
కలువపూవు లవె కానుకగాఁ గైకొని
పలుదెరఁగులఁ జేతఁ బట్టు కున్నది

(॥॥)
వినయముతో నాకె విన్నప మవధరించు
ననుపున నీకు మనవి చెప్పీని
తనివార నీవు గందము పూయించు కొమ్మిదె
కనుఁగొని నీకు వూడిగము సేసీని

(॥॥)
సంగడి శ్రీవేంకటేశ చనవు లీడేరించు
చెంగట నలమేల్మంగ సేసవెట్టీని
యింగిత మెఱిఁగి నీవె యిన్నిటానుఁ గరుణించు
ముంగిటఁ గొలువు సేసి మోము చూచీని.

(||pallavi||)
yĕchchariga deva nīgu nĕkkaḍa parāgu
machchiga nīmīm̐da vemārum̐ jallīni

(||||)
sĕli nī yĕduḍa nadĕ sittagiṁchu mippu ḍiṭṭe
malasi sŏlasi nīdo māḍalāḍīni
kaluvabūvu lavĕ kānugagām̐ gaigŏni
paludĕram̐gulam̐ jedam̐ baṭṭu kunnadi

(||||)
vinayamudo nāgĕ vinnaba mavadhariṁchu
nanubuna nīgu manavi sĕppīni
tanivāra nīvu gaṁdamu pūyiṁchu kŏmmidĕ
kanum̐gŏni nīgu vūḍigamu sesīni

(||||)
saṁgaḍi śhrīveṁkaḍeśha sanavu līḍeriṁchu
sĕṁgaḍa nalamelmaṁga sesavĕṭṭīni
yiṁgida mĕṟim̐gi nīvĕ yinniḍānum̐ garuṇiṁchu
muṁgiḍam̐ gŏluvu sesi momu sūsīni.