Yam(em?)ta sakkanidi neegu nekkadam galigenayyaa

యం(ఎం?)త చక్కనిది నీకు నెక్కడఁ గలిగెనయ్యా
Language

(॥పల్లవి॥)
యం(ఎం?)త చక్కనిది నీకు నెక్కడఁ గలిగెనయ్యా
పంతపు నీచెలులెల్లా భ్రమసిరి చూచి

(॥ఎంత॥)
నిగనిగ మెరిచేటి నిమ్మండు వంటి యంతి
చిగురువేళ్ళఁ దురుము చెక్కుకొంటాను
జిగి మించఁ జంద్రకావిచీర గట్టుకొని నీతో
పగటుగుబ్బ లదర పకపక నవ్వెను

(॥ఎంత॥)
పనిగుండుఁజేతుల బంగారువంటియింతి
పొసఁగఁ దామర చేతఁ బూఁచుకొంటాను
యెసఁగ ఎంతసొమ్ములు యెనైనాఁ బెట్టుకొని
కొసరి దంతకాంతులఁ గులికి మాటాడెను

(॥ఎంత॥)
వరుస బద్మరాగాలవంటిపాదాలయింతి
సరుగ గందవొడి మైఁ జల్లుకొంటాను
తెరలో శ్రీవేంకటేశ తేఁకువతో నిన్నుఁ గూడి
సిరులఁ గొలువులోనఁ జేరి సన్న సేసెను

(||pallavi||)
yaṁ(ĕṁ?)ta sakkanidi nīgu nĕkkaḍam̐ galigĕnayyā
paṁtabu nīsĕlulĕllā bhramasiri sūsi

(||ĕṁta||)
niganiga mĕriseḍi nimmaṁḍu vaṁṭi yaṁti
siguruveḽḽam̐ durumu sĕkkugŏṁṭānu
jigi miṁcham̐ jaṁdragāvisīra gaṭṭugŏni nīdo
pagaḍugubba ladara pagabaga navvĕnu

(||ĕṁta||)
paniguṁḍum̐jedula baṁgāruvaṁṭiyiṁti
pŏsam̐gam̐ dāmara sedam̐ būm̐sugŏṁṭānu
yĕsam̐ga ĕṁtasŏmmulu yĕnainām̐ bĕṭṭugŏni
kŏsari daṁtagāṁtulam̐ guligi māḍāḍĕnu

(||ĕṁta||)
varusa badmarāgālavaṁṭibādālayiṁti
saruga gaṁdavŏḍi maim̐ jallugŏṁṭānu
tĕralo śhrīveṁkaḍeśha tem̐kuvado ninnum̐ gūḍi
sirulam̐ gŏluvulonam̐ jeri sanna sesĕnu