Yam(em?)ta nerubari yidi yemtadi jaana

యం(ఎం?)త నేరుపరి యిది యెంతటి జాణ
Language

(॥పల్లవి॥)
యం(ఎం?)త నేరుపరి యిది యెంతటి జాణ
యింతేసి వేడుకల నెలయించీ నిన్నును

(॥ఎంత॥)
కన్నులనే మాఁటలాడి కపురానఁ గొని వేసి
సన్నసేసి పిలిచీ సతి నిన్నును
చన్నుమీఁదిపయ్యద జారఁగాను కొనవేళ
కిన్నెరమీఁటులు మీఁటి గిలిగించీ నిన్నును

(॥ఎంత॥)
కెఱలి కెఱలి నవ్వి కేలెత్తి నీకు మొక్కి
కఱఁగించీ సారె సారె కాంత నిన్నును
మెఱయఁ బూవులకోల మీఁదఁ జాఁచి వల
పెఱుకలు పైపై బయలీఁదించీ నిన్నును

(॥ఎంత॥)
కాయమున సోఁకించి కందున నీకుఁ జూపి
యీయెడనే కాఁగిలించీ నింతి నిన్నును
పాయక శ్రీవేంకటేశ పచ్చిదేర నిన్నుఁ గూడి
ఆయము లంటించి ప్రియ మందించీ నిన్నును

(||pallavi||)
yaṁ(ĕṁ?)ta nerubari yidi yĕṁtaḍi jāṇa
yiṁtesi veḍugala nĕlayiṁchī ninnunu

(||ĕṁta||)
kannulane mām̐ṭalāḍi kaburānam̐ gŏni vesi
sannasesi pilisī sadi ninnunu
sannumīm̐dibayyada jāram̐gānu kŏnaveḽa
kinnĕramīm̐ṭulu mīm̐ṭi giligiṁchī ninnunu

(||ĕṁta||)
kĕṟali kĕṟali navvi kelĕtti nīgu mŏkki
kaṟam̐giṁchī sārĕ sārĕ kāṁta ninnunu
mĕṟayam̐ būvulagola mīm̐dam̐ jām̐si vala
pĕṟugalu paibai bayalīm̐diṁchī ninnunu

(||ĕṁta||)
kāyamuna som̐kiṁchi kaṁduna nīgum̐ jūbi
yīyĕḍane kām̐giliṁchī niṁti ninnunu
pāyaga śhrīveṁkaḍeśha pachchidera ninnum̐ gūḍi
āyamu laṁṭiṁchi priya maṁdiṁchī ninnunu