Vuttama naayagumdavu vorubu galavu neevu

వుత్తమ నాయకుఁడవు వోరుపు గలవు నీవు
Language

(॥పల్లవి॥)
వుత్తమ నాయకుఁడవు వోరుపు గలవు నీవు
చిత్తగించి నా బత్తి చేకొనవయ్యా

(॥॥)
ఇంగిత మెఱఁగ నైతి నేడలేనివి గడించి
వెంగెము నిన్నాడితి వెనకకును
సంగతెఱిఁగితి నిట్టే సమ్మతించితి నీ మాట
చెంగలించి నీకు మొక్కేఁ జేకొనవయ్యా

(॥॥)
విరఁహపుఁ గాఁకఁ జెంది వేఁడుకోఁ గానే నిన్ను
విరులు గొని వేసితి వేమారును
సరువు లెల్లా గంటి సంతోసించు కొంటి నిన్ను
సిరుల బంతము లిచ్చె జేకొనవయ్య

(॥॥)
మిక్కిలి మోహము తొడ మేన వాడ వనగానే
వెక్కసాన జంకించితి విచ్చనవిడి
యిక్కడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టే
చెక్కు నొక్కి నవ్వించేఁ జే కొనవయ్యా

(||pallavi||)
vuttama nāyagum̐ḍavu vorubu galavu nīvu
sittagiṁchi nā batti segŏnavayyā

(||||)
iṁgida mĕṟam̐ga naidi neḍalenivi gaḍiṁchi
vĕṁgĕmu ninnāḍidi vĕnagagunu
saṁgadĕṟim̐gidi niṭṭe sammadiṁchidi nī māḍa
sĕṁgaliṁchi nīgu mŏkkem̐ jegŏnavayyā

(||||)
viram̐habum̐ gām̐kam̐ jĕṁdi vem̐ḍugom̐ gāne ninnu
virulu gŏni vesidi vemārunu
saruvu lĕllā gaṁṭi saṁtosiṁchu kŏṁṭi ninnu
sirula baṁtamu lichchĕ jegŏnavayya

(||||)
mikkili mohamu tŏḍa mena vāḍa vanagāne
vĕkkasāna jaṁkiṁchidi vichchanaviḍi
yikkaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭe
sĕkku nŏkki navviṁchem̐ je kŏnavayyā