వుప్పతిల్లీ జవ్వనము వొళ్ళి మీఁదను
(॥పల్లవి॥)
వుప్పతిల్లీ జవ్వనము వొళ్ళి మీఁదను
యెప్పుడు మఱవరాదు యేమి సేతునే
(॥॥)
చిలుకతో మాటాడితే చిమ్మి రేఁచీ వలపులు
కొలని లోపల నైతే నళుల బాద
పలు దిక్కులుఁ జూచితే పరగీ వెన్నెల వేఁడి
యెలమి నెందుఁ బోరాదు యేమి సేతునే
(॥॥)
సింగారపుఁ దోఁట నుంటే చిగురులు బెదరించీ
కంగి చింతించితే మదిఁ గంతుఁ డున్నాఁడు
కొంగున విసురుకొంటే గుప్పించీఁ జల్లగాలి
యింగితము దెలియదు యేమి సేతునే
(॥॥)
కత లాలకించే నంటే కలసీఁ గోవిలఁ కూత
మితి నేకతాన నుంటే మించీఁ గోరిక
గతియై యింతలో శ్రీ వేంకటేశుఁ డు నన్ను నేలే
యితని వుప కారాన కేమి సేతునే
(||pallavi||)
vuppadillī javvanamu vŏḽḽi mīm̐danu
yĕppuḍu maṟavarādu yemi sedune
(||||)
silugado māḍāḍide simmi rem̐sī valabulu
kŏlani lobala naide naḽula bāda
palu dikkulum̐ jūside paragī vĕnnĕla vem̐ḍi
yĕlami nĕṁdum̐ borādu yemi sedune
(||||)
siṁgārabum̐ dom̐ṭa nuṁṭe sigurulu bĕdariṁchī
kaṁgi siṁtiṁchide madim̐ gaṁtum̐ ḍunnām̐ḍu
kŏṁguna visurugŏṁṭe guppiṁchīm̐ jallagāli
yiṁgidamu dĕliyadu yemi sedune
(||||)
kada lālagiṁche naṁṭe kalasīm̐ govilam̐ kūda
midi negadāna nuṁṭe miṁchīm̐ goriga
gadiyai yiṁtalo śhrī veṁkaḍeśhum̐ ḍu nannu nele
yidani vuba kārāna kemi sedune