Vovo raagaasulaala voddu sumdi vairamu

వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
Language

(॥పల్లవి॥)
వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
దేవుని శరణనరో తెలుసుకోరో

(॥వోవో॥)
జగములో రాముఁడై జనియించె విష్ణుఁ డిదె
అగపడి లక్ష్మీ సీత యయి పుట్టెను
తగు శేషశంఖచక్ర దైవసాధనము లెల్ల
తగిలి లక్ష్మణ భరత శతృఘ్నులయిరి

(॥వోవో॥)
సురలు వానరు లైరి సూర్యుఁడు సుగ్రీవుఁడు
మరిగి రుద్రుఁడు హనుమంతుఁడాయెను
సరుస బ్రహ్మదేవుఁడు జాంబవంతుఁ డైనాఁడు
వెరవరి నలుఁడే విశ్వకర్మ సుండి

(॥వోవో॥)
కట్టిరి సేతు వప్పుడే ఘను లెల్లా దాఁటిరి
ముట్టిరి లంకా నగరము దళము
అట్టి శ్రీ వేంకటేశుఁ డాతఁడే యీతఁడై
వొట్టుచు వరము లిచ్చె వొనర దాసులకు

(||pallavi||)
vovo rāgāsulāla vŏddu suṁḍi vairamu
devuni śharaṇanaro tĕlusugoro

(||vovo||)
jagamulo rāmum̐ḍai janiyiṁchĕ viṣhṇum̐ ḍidĕ
agabaḍi lakṣhmī sīda yayi puṭṭĕnu
tagu śheṣhaśhaṁkhasakra daivasādhanamu lĕlla
tagili lakṣhmaṇa bharada śhatṛghnulayiri

(||vovo||)
suralu vānaru lairi sūryum̐ḍu sugrīvum̐ḍu
marigi rudrum̐ḍu hanumaṁtum̐ḍāyĕnu
sarusa brahmadevum̐ḍu jāṁbavaṁtum̐ ḍainām̐ḍu
vĕravari nalum̐ḍe viśhvagarma suṁḍi

(||vovo||)
kaṭṭiri sedu vappuḍe ghanu lĕllā dām̐ṭiri
muṭṭiri laṁkā nagaramu daḽamu
aṭṭi śhrī veṁkaḍeśhum̐ ḍādam̐ḍe yīdam̐ḍai
vŏṭṭusu varamu lichchĕ vŏnara dāsulagu