Vooragunnadaani nela vudigimchevu

వూరకున్నదాని నేల వుడికించేవు
Language

(॥పల్లవి॥)
వూరకున్నదాని నేల వుడికించేవు
కోరిక నీకుఁ గలిగితే కూడి యేలవయ్యా

(॥॥)
చెలి నీ చేఁతలు విని చింతతోడ నుండఁగాను
యెలమిఁ బువ్వుల వేసే వి దేమయ్యా
చలివాసి నీ సుద్దులు సకులతోఁ జెప్పఁగాను
చిలుకునఁ బయ్యద దీసే విదేమయ్యా

(॥॥)
సుదతి నీ చిన్నలు చూచి తలవంచుకోఁగా
యెదుట నొట్లు వెట్టే వి దేమయ్యా
వెదకి నీ గుణాలకు వెరగంది వుండఁగాను
చెదరఁ దీసి కొప్పు చెనకే వి దేమయ్యా

(॥॥)
కాంత నీవు వేఁ డుకొంటే కడు సిగ్గుతో నుండఁగా
యెంత బలిమిఁ బెనఁ గే వేమయ్యా
యింతలోనె శ్రీ వేంకటేశ యీకెఁ గూడితివి
వింత సతిఁ దడవేవు వేరే ఇదేమయ్యా

(||pallavi||)
vūragunnadāni nela vuḍigiṁchevu
koriga nīgum̐ galigide kūḍi yelavayyā

(||||)
sĕli nī sem̐talu vini siṁtadoḍa nuṁḍam̐gānu
yĕlamim̐ buvvula vese vi demayyā
salivāsi nī suddulu saguladom̐ jĕppam̐gānu
silugunam̐ bayyada dīse videmayyā

(||||)
sudadi nī sinnalu sūsi talavaṁchugom̐gā
yĕduḍa nŏṭlu vĕṭṭe vi demayyā
vĕdagi nī guṇālagu vĕragaṁdi vuṁḍam̐gānu
sĕdaram̐ dīsi kŏppu sĕnage vi demayyā

(||||)
kāṁta nīvu vem̐ ḍugŏṁṭe kaḍu siggudo nuṁḍam̐gā
yĕṁta balimim̐ bĕnam̐ ge vemayyā
yiṁtalonĕ śhrī veṁkaḍeśha yīgĕm̐ gūḍidivi
viṁta sadim̐ daḍavevu vere idemayyā