Vooragumda nemtige vuvida neegu

వూరకుండ నేఁటికే వువిద నీకు
Language

(॥పల్లవి॥)
వూరకుండ నేఁటికే వువిద నీకు
చేరి చేరి చెనకితే సిగ్గుదేరుఁ గాకా

(॥॥)
యెరవు లేని పతితో నెడమాట లాడ నేల
సరసము లాడితేను చవిగాకా
విరుల వేయఁగాను వెఱగులు వడ నేల
మరలఁగ వేసితేను మచ్చిక లవుఁగాకా

(॥॥)
మచ్చిక సేయఁగానే మనసు సాదించ నేల
యిచ్చగించి వుండుటే యింపుఁగాకా
అచ్చలాస నవ్వఁగాను ఆనుమానించఁగ నేల
కుచ్చి కౌఁగిలించుకొంటే గుఱుతులౌఁగాకా

(॥॥)
కూడి మాడి వుండఁగా నీ గుణాలు వెదక నేల
జోడైన రతులఁ బొంది చొక్కుట గాకా
యీడనే శ్రీ వేంకటేశుఁడేలె నన్ను నింతలోనె
వాడికలు సేసుకొంటే వసమౌఁగాకా

(||pallavi||)
vūraguṁḍa nem̐ṭige vuvida nīgu
seri seri sĕnagide sigguderum̐ gāgā

(||||)
yĕravu leni padido nĕḍamāḍa lāḍa nela
sarasamu lāḍidenu savigāgā
virula veyam̐gānu vĕṟagulu vaḍa nela
maralam̐ga vesidenu machchiga lavum̐gāgā

(||||)
machchiga seyam̐gāne manasu sādiṁcha nela
yichchagiṁchi vuṁḍuḍe yiṁpum̐gāgā
achchalāsa navvam̐gānu ānumāniṁcham̐ga nela
kuchchi kaum̐giliṁchugŏṁṭe guṟudulaum̐gāgā

(||||)
kūḍi māḍi vuṁḍam̐gā nī guṇālu vĕdaga nela
joḍaina radulam̐ bŏṁdi sŏkkuḍa gāgā
yīḍane śhrī veṁkaḍeśhum̐ḍelĕ nannu niṁtalonĕ
vāḍigalu sesugŏṁṭe vasamaum̐gāgā