Voorage dakkuduvaa vuvidalagu

వూరకే దక్కుదువా వువిదలకు
Language

(॥పల్లవి॥)
వూరకే దక్కుదువా వువిదలకు
యీరీతి నీ సేవ సేసే నేఁటికి వద్దనేవూ

(॥॥)
పెదవులు మోపి నీకుఁ బ్రియములు చెప్పవలె
చెదర కిచ్చకములు సేయఁ గవలె
కదలుఁ గన్నుల నిట్టే కాంక్షతోడఁ జూడవలె
వదలుఁ బయ్యద జార వంగి మొక్కవలెను

(॥॥)
నీ వేమి చెప్పినాను నెట్టు కొని వినవలె
భావించి నీ మాట కొడఁ బడవలెను
కైవసమై వీడె మిచ్చి కౌఁగిట నించఁగవలె
వే వేలకుఁ జెక్కు నొక్కి వేఁడుకొనవలెను

(॥॥)
సరసములాడితేను సమ్మతించి నవ్వవలె
ఇరవై రతిఁ గూడితే నెనయవలె
అరుదై శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
మరిగించితి విట్లా మతిఁ జొక్కవలెనూ

(||pallavi||)
vūrage dakkuduvā vuvidalagu
yīrīdi nī seva sese nem̐ṭigi vaddanevū

(||||)
pĕdavulu mobi nīgum̐ briyamulu sĕppavalĕ
sĕdara kichchagamulu seyam̐ gavalĕ
kadalum̐ gannula niṭṭe kāṁkṣhadoḍam̐ jūḍavalĕ
vadalum̐ bayyada jāra vaṁgi mŏkkavalĕnu

(||||)
nī vemi sĕppinānu nĕṭṭu kŏni vinavalĕ
bhāviṁchi nī māḍa kŏḍam̐ baḍavalĕnu
kaivasamai vīḍĕ michchi kaum̐giḍa niṁcham̐gavalĕ
ve velagum̐ jĕkku nŏkki vem̐ḍugŏnavalĕnu

(||||)
sarasamulāḍidenu sammadiṁchi navvavalĕ
iravai radim̐ gūḍide nĕnayavalĕ
arudai śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
marigiṁchidi viṭlā madim̐ jŏkkavalĕnū