వూరకే దక్కు నటవే వుడివోని వలపు
(॥పల్లవి॥)
వూరకే దక్కు నటవే వుడివోని వలపు
గారవించి యాతనిఁ గౌగిలించఁ గదవే
(॥॥)
మంచి మాట లాడితేను మరిగి నమ్మిక వుట్టు
ఇంచుకంత నవ్వినాను యియ్యకో లవును
వంచనతో మొక్కితేను వడి మొగమాట గల్గు
మించుగాఁ బొగడితేను మే లెల్లా దైవారును
(॥॥)
మళ్ళి మళ్ళి చూచితేను మనసులు గరఁగును
వెల్లివిరిఁ గొసరితే వేడుక లవును
వొల్లనే వీడె మిచ్చితే వుప్పతిల్లుఁ దమకము
చెల్లు బడి గలిగితే సిగ్గు లెల్లాఁ దేరునూ
(॥॥)
యిచ్చకమై వుండితేను యింపు లౌను రతు లెల్లా
పచ్చిదేరఁ గూడితేను బలుసు నాస
యిచ్చట శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
తచ్చన లేక యేలెఁ దలఁపు లీడేరెనూ
(||pallavi||)
vūrage dakku naḍave vuḍivoni valabu
gāraviṁchi yādanim̐ gaugiliṁcham̐ gadave
(||||)
maṁchi māḍa lāḍidenu marigi nammiga vuṭṭu
iṁchugaṁta navvinānu yiyyago lavunu
vaṁchanado mŏkkidenu vaḍi mŏgamāḍa galgu
miṁchugām̐ bŏgaḍidenu me lĕllā daivārunu
(||||)
maḽḽi maḽḽi sūsidenu manasulu garam̐gunu
vĕllivirim̐ gŏsaride veḍuga lavunu
vŏllane vīḍĕ michchide vuppadillum̐ damagamu
sĕllu baḍi galigide siggu lĕllām̐ derunū
(||||)
yichchagamai vuṁḍidenu yiṁpu launu radu lĕllā
pachchideram̐ gūḍidenu balusu nāsa
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
tachchana lega yelĕm̐ dalam̐pu līḍerĕnū