వొక్క గరిడీలోనే వోటపంతా లిఁక నేల
(॥పల్లవి॥)
వొక్క గరిడీలోనే వోటపంతా లిఁక నేల
చిక్కించి యిద్దరి సరి సేసేము గాని
(॥॥)
వెలఁది బొమ్మలనే విలువిద్య సాము సేసె
చిలుకుటమ్ములందుకు చిమ్ముఁ జూపులు
చలపట్టి యాపె చను సంగడా లెత్తఁగరాదా
చెలఁ యిద్దరి సరి సేసేముగాని
(॥॥)
తరుణి కొనగోరనే దారకత్తి సాముసేసె
అరిది ముంజేయి కొర డందుకుఁ దోడు
సరిఁ బిఱిఁది యరిగె సాదించి పట్టఁ గరాదా
సిరుల నిద్దరి సరిసేసేముగాని
(॥॥)
కాంత నీతో కౌఁగిటిలో కంబముసాము సేసె
అంతటా నీవు పెన్నుద్ది వందు కైతివి
పంతవు శ్రీ వేంకటేశ ప చ్చి మోవి మోప రాదా
చెంతల నిద్దరి సరిసేసేము గాని
(||pallavi||)
vŏkka gariḍīlone voḍabaṁtā lim̐ka nela
sikkiṁchi yiddari sari sesemu gāni
(||||)
vĕlam̐di bŏmmalane viluvidya sāmu sesĕ
siluguḍammulaṁdugu simmum̐ jūbulu
salabaṭṭi yābĕ sanu saṁgaḍā lĕttam̐garādā
sĕlam̐ yiddari sari sesemugāni
(||||)
taruṇi kŏnagorane dāragatti sāmusesĕ
aridi muṁjeyi kŏra ḍaṁdugum̐ doḍu
sarim̐ biṟim̐di yarigĕ sādiṁchi paṭṭam̐ garādā
sirula niddari sarisesemugāni
(||||)
kāṁta nīdo kaum̐giḍilo kaṁbamusāmu sesĕ
aṁtaḍā nīvu pĕnnuddi vaṁdu kaidivi
paṁtavu śhrī veṁkaḍeśha pa schi movi moba rādā
sĕṁtala niddari sarisesemu gāni