Vojagu vachchinavaani nodigaanam goodaraadaa

వోజకు వచ్చినవాని నొడికానఁ గూడరాదా
Language

(॥పల్లవి॥)
వోజకు వచ్చినవాని నొడికానఁ గూడరాదా
సాజము దెలుసుకోవే చలపట్ట నేఁటికి

(॥॥)
కలసిమెలసి నీతోఁ గాఁపురము సేసేవాని
తొలుతటిచేఁత లెంచి దూరనేఁటికి
చెలరేఁగి నీకు నిట్టె చెప్పినట్టు సేసేవాని
బలిమిని చొప్పులెత్తి పత్తిసేయనేఁటికి

(॥॥)
నవ్వుతాఁ దెగడుతాను ననుపై వుండెడివాని
వువ్విళూర్ల మర్మాలెత్తి వొరయనేలే
చివ్వన నిచ్చకములే సేసుక నడచేవాని
రవ్వగా సిగ్గువరచి రచ్చ వేయనేఁటికె

(॥॥)
కన్నుసన్నలనే నిన్నుఁ గాఁగిట నేలినవాని
పిన్ననాఁటిసుద్దు లవి పేరుకోనేలే
యిన్నిటా శ్రీ వేంకటేశుఁ డీతఁడే మన్నించె నేఁడు
కిన్నెర మీఁట గోర గిలిగించ నేఁటికే

(||pallavi||)
vojagu vachchinavāni nŏḍigānam̐ gūḍarādā
sājamu dĕlusugove salabaṭṭa nem̐ṭigi

(||||)
kalasimĕlasi nīdom̐ gām̐puramu sesevāni
tŏludaḍisem̐ta lĕṁchi dūranem̐ṭigi
sĕlarem̐gi nīgu niṭṭĕ sĕppinaṭṭu sesevāni
balimini sŏppulĕtti pattiseyanem̐ṭigi

(||||)
navvudām̐ dĕgaḍudānu nanubai vuṁḍĕḍivāni
vuvviḽūrla marmālĕtti vŏrayanele
sivvana nichchagamule sesuga naḍasevāni
ravvagā sigguvarasi rachcha veyanem̐ṭigĕ

(||||)
kannusannalane ninnum̐ gām̐giḍa nelinavāni
pinnanām̐ṭisuddu lavi perugonele
yinniḍā śhrī veṁkaḍeśhum̐ ḍīdam̐ḍe manniṁchĕ nem̐ḍu
kinnĕra mīm̐ṭa gora giligiṁcha nem̐ṭige