Voja dappagumdaa vale noyyaarabu daanigi

వోజ దప్పకుండా వలె నొయ్యారపు దానికి
Language

(॥పల్లవి॥)
వోజ దప్పకుండా వలె నొయ్యారపు దానికి
సాజపు రమణుని కే చందమైనా నమరును

(॥॥)
కరుణించి తానే వచ్చి కలసితేఁ దగుఁగాక
వరుసఁ దరవువెట్ట వచ్చునా నాకు
మరిగి యప్పటి నాతో మాటాడితే నాడెఁగాక
యెరవుల దానివలె యెచ్చరించఁ దగవా

(॥॥)
సమ్మతించి నామోవి చవిగొంటే నింపు గాక
నెమ్మది నొడఁబరచ నేరుపా నాకు
చిమ్ముచుఁ జెనకితేను సేవసేయఁ గూడుఁగాక
దిమ్మరితనాన నాకు దీకొన సరవులా

(॥॥)
సారె సారె నవ్వితేను సరసమాడుదుఁ గాక
చేరి మందెమేళాలు చెల్లునా నాకు
యీరీతి శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
కూరిమి నన్నేలినాఁడు కొసర నుచితమా

(||pallavi||)
voja dappaguṁḍā valĕ nŏyyārabu dānigi
sājabu ramaṇuni ke saṁdamainā namarunu

(||||)
karuṇiṁchi tāne vachchi kalasidem̐ dagum̐gāga
varusam̐ daravuvĕṭṭa vachchunā nāgu
marigi yappaḍi nādo māḍāḍide nāḍĕm̐gāga
yĕravula dānivalĕ yĕchchariṁcham̐ dagavā

(||||)
sammadiṁchi nāmovi savigŏṁṭe niṁpu gāga
nĕmmadi nŏḍam̐barasa nerubā nāgu
simmusum̐ jĕnagidenu sevaseyam̐ gūḍum̐gāga
dimmaridanāna nāgu dīgŏna saravulā

(||||)
sārĕ sārĕ navvidenu sarasamāḍudum̐ gāga
seri maṁdĕmeḽālu sĕllunā nāgu
yīrīdi śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
kūrimi nannelinām̐ḍu kŏsara nusidamā