వొగ్గి నామాట వినవే వో వదినె
(॥పల్లవి॥)
వొగ్గి నామాట వినవే వో వదినె
సిగ్గరిమఱఁది వవి చెవులు సోఁకవు
(॥వొగ్గి॥)
వొద్దికి వత్త నటవే వో వదినే వోరి
పొద్దువోని మఱఁదివి పొసఁగదురా
గద్దించకువే సందేకాడవదినే
ముద్దుల మఱఁది వింత మొక్కల మేఁటికిలా
(॥వొగ్గి॥)
వొల్లవదే వీడెవో వదినె వోరి
కల్లరిమఱదిఁవది కారము లేరా
మెల్లనె గొణఁగకువే మేనవదినె
పల్లదపుమఱఁదివి పచ్చిగా నవ్వకురా
(॥వొగ్గి॥)
వోవరిలో వొడివట్టెనో వదినె వోరి
కైవపుమఱఁదివి కైకొంటిరా
లావులు చూపకువే మేలుపు వదినె
శ్రీవేంకటాద్రిమఱఁది చిమ్మి రేఁచ నేలరా
(||pallavi||)
vŏggi nāmāḍa vinave vo vadinĕ
siggarimaṟam̐di vavi sĕvulu som̐kavu
(||vŏggi||)
vŏddigi vatta naḍave vo vadine vori
pŏdduvoni maṟam̐divi pŏsam̐gadurā
gaddiṁchaguve saṁdegāḍavadine
muddula maṟam̐di viṁta mŏkkala mem̐ṭigilā
(||vŏggi||)
vŏllavade vīḍĕvo vadinĕ vori
kallarimaṟadim̐vadi kāramu lerā
mĕllanĕ gŏṇam̐gaguve menavadinĕ
palladabumaṟam̐divi pachchigā navvagurā
(||vŏggi||)
vovarilo vŏḍivaṭṭĕno vadinĕ vori
kaivabumaṟam̐divi kaigŏṁṭirā
lāvulu sūbaguve melubu vadinĕ
śhrīveṁkaḍādrimaṟam̐di simmi rem̐sa nelarā