వొడివట్టే వేమోయి వో బావ యింత
(॥పల్లవి॥)
వొడివట్టే వేమోయి వో బావ యింత
వడిగా మాతో నవ్వవలెఁగా వో బావ
(॥వొడి॥)
వొద్దఁ గూచుండే వేమోయి వో బావ నీ
వుద్దండాలు మానవుగా వో బావ
వొద్దు సుమీ జాణతనా లో బావ నీ
సుద్దు లెల్లా విని విని చొక్కితి నో బావ
(॥వొడి॥)
వొల్లనే లోనికి వచ్చి వో బావ నా
వుల్ల మెల్లాఁ గరఁగించేవు వో బావ
వొల్ల ననరాదు పొందులో బావ
వెల్లివిరేల సేసేవు వేడుక లో బావ
(॥వొడి॥)
వుట్టి పడి న న్నేలితి వో బావ యంత
వొట్టు వెట్టిన మానవు వో బావ
వుట్టి కెక్కె నీ సిగ్గులు వో బావ యిక
గట్టి యాయ ప్రేమ శ్రీవేంకటగిరిబావా
(||pallavi||)
vŏḍivaṭṭe vemoyi vo bāva yiṁta
vaḍigā mādo navvavalĕm̐gā vo bāva
(||vŏḍi||)
vŏddam̐ gūsuṁḍe vemoyi vo bāva nī
vuddaṁḍālu mānavugā vo bāva
vŏddu sumī jāṇadanā lo bāva nī
suddu lĕllā vini vini sŏkkidi no bāva
(||vŏḍi||)
vŏllane lonigi vachchi vo bāva nā
vulla mĕllām̐ garam̐giṁchevu vo bāva
vŏlla nanarādu pŏṁdulo bāva
vĕllivirela sesevu veḍuga lo bāva
(||vŏḍi||)
vuṭṭi paḍi na nnelidi vo bāva yaṁta
vŏṭṭu vĕṭṭina mānavu vo bāva
vuṭṭi kĕkkĕ nī siggulu vo bāva yiga
gaṭṭi yāya prema śhrīveṁkaḍagiribāvā