వొడిఁ బెట్టుకొనరాదా వువిద నేపొద్దు నీవు
(॥పల్లవి॥)
వొడిఁ బెట్టుకొనరాదా వువిద నేపొద్దు నీవు
కడు నేల లోఁగేవు కా దనేనా నేను
(॥॥)
జలజాక్షి నీతో సరసములాడి తనివోదు
తళుకుఁ జూపులఁ జూచి తనివోదు
కొలువు లోపల నిన్నుఁ గొసరియుఁ దనివోదు
యెలమి నీమీఁద నీకె కెంత మోహమో
(॥॥)
పనివడి చేయి వేసి పందే లాడి తనివోదు
తనలో నిన్ను భావించి తనివోదు
చెనకుచు నూడిగాలు చేసి చేసి తనివోదు
యెనసి నీ మీఁద నీకె కెంత మోహమో
(॥॥)
మచ్చికలు చూపి నీతో మాటలాడి తనివోదు
తచ్చి సెలవుల నవ్వి తనివోదు
అచ్చమై శ్రీ వేంకటేశ అట్టే నన్ను నేలితివి
హెచ్చి యీకె నిన్నుఁ గూడె నెంత మోహమో
(||pallavi||)
vŏḍim̐ bĕṭṭugŏnarādā vuvida nebŏddu nīvu
kaḍu nela lom̐gevu kā danenā nenu
(||||)
jalajākṣhi nīdo sarasamulāḍi tanivodu
taḽugum̐ jūbulam̐ jūsi tanivodu
kŏluvu lobala ninnum̐ gŏsariyum̐ danivodu
yĕlami nīmīm̐da nīgĕ kĕṁta mohamo
(||||)
panivaḍi seyi vesi paṁde lāḍi tanivodu
tanalo ninnu bhāviṁchi tanivodu
sĕnagusu nūḍigālu sesi sesi tanivodu
yĕnasi nī mīm̐da nīgĕ kĕṁta mohamo
(||||)
machchigalu sūbi nīdo māḍalāḍi tanivodu
tachchi sĕlavula navvi tanivodu
achchamai śhrī veṁkaḍeśha aṭṭe nannu nelidivi
hĕchchi yīgĕ ninnum̐ gūḍĕ nĕṁta mohamo