Voddu neevu naageduraa vori kamsumdaa

వొద్దు నీవు నాకెదురా వోరి కంసుఁడా
Language

(॥పల్లవి॥)
వొద్దు నీవు నాకెదురా వోరి కంసుఁడా
కొద్దిగాదు పెనఁగఁగ గోవిందుతోఁ గంసుఁడా

(॥వొద్దు॥)
పెరిగీ రేపల్లే నదె బిరుదునీవైరి వాఁడే
వొరసి నన్నేలపట్టే వోరికంసుఁడా
విరసాన వెరవను విష్ణుమాయను నీ-
గొరబైనవెడబుద్ది గొలుపద వోరా

(॥వొద్దు॥)
వెదకీ నీవైరి వాఁడె వీరదానవులనదె
వుదుటు నాతోనేల వోరికంసుఁడా
చిదుమనా నిన్నిపుడే సెలవీఁడుగా కతఁడు
పెదవుల చేటింతే పేదవానికోపము

(॥వొద్దు॥)
వెన్నలుఁ బాలారగించి వెసఁవాడె సత్వగూడ-
నున్నవాఁడు, నిన్నుగెల్వ నోరి కంసుఁడా
వెన్నుఁడు శ్రీవేంకటాద్రి విభుఁడు లోకులఁగాచె-
నన్నిటాఁ గృష్ణావతార మందఁబట్టి నేఁడు

(||pallavi||)
vŏddu nīvu nāgĕdurā vori kaṁsum̐ḍā
kŏddigādu pĕnam̐gam̐ga goviṁdudom̐ gaṁsum̐ḍā

(||vŏddu||)
pĕrigī reballe nadĕ birudunīvairi vām̐ḍe
vŏrasi nannelabaṭṭe vorigaṁsum̐ḍā
virasāna vĕravanu viṣhṇumāyanu nī-
gŏrabainavĕḍabuddi gŏlubada vorā

(||vŏddu||)
vĕdagī nīvairi vām̐ḍĕ vīradānavulanadĕ
vuduḍu nādonela vorigaṁsum̐ḍā
sidumanā ninnibuḍe sĕlavīm̐ḍugā kadam̐ḍu
pĕdavula seḍiṁte pedavānigobamu

(||vŏddu||)
vĕnnalum̐ bālāragiṁchi vĕsam̐vāḍĕ satvagūḍa-
nunnavām̐ḍu, ninnugĕlva nori kaṁsum̐ḍā
vĕnnum̐ḍu śhrīveṁkaḍādri vibhum̐ḍu logulam̐gāsĕ-
nanniḍām̐ gṛṣhṇāvadāra maṁdam̐baṭṭi nem̐ḍu