Voddivaa rellaa saakshi ubemdrumdaa mana

వొద్దివా రెల్లా సాక్షి ఉపేంద్రుఁడా మన
Language

(॥పల్లవి॥)
వొద్దివా రెల్లా సాక్షి ఉపేంద్రుఁడా మన
వొద్దిక నీ వెఱుఁగవా ఉపేంద్రుఁడా

(॥వొద్ది॥)
వుడివోని వేడుకల ఉపేంద్రుఁడా యింత
వొడఁబరచవలెనా నుపేంద్రుఁడా
వొడిగట్టితిమి నీకు నుపేంద్రుఁడా మా
వొడలిపై సొమ్ము నీవె ఉపేంద్రుఁడా

(॥వొద్ది॥)
వోడఁ గట్టినదూలమవై ఉపేంద్రుఁడా నీకు
నూడిగాలు సేసేము ఉపేంద్రుఁడా
వోడకుమీ రతికేలి నుపేంద్రుఁడా యింత
నూడదు నీ నా లంకె ఉపేంద్రుఁడా

(॥వొద్ది॥)
వొల్లనే నన్నుఁ గూడితి ఉపేంద్రుఁడా నా
వుల్లములో నీవే కావా ఉపేంద్రుఁడా
వుల్లనపు శ్రీవేంకట ఉపేంద్రుఁడా యిమ్మా
వుల్లునుకు తేనెమోవి ఉపేంద్రుఁడా

(||pallavi||)
vŏddivā rĕllā sākṣhi ubeṁdrum̐ḍā mana
vŏddiga nī vĕṟum̐gavā ubeṁdrum̐ḍā

(||vŏddi||)
vuḍivoni veḍugala ubeṁdrum̐ḍā yiṁta
vŏḍam̐barasavalĕnā nubeṁdrum̐ḍā
vŏḍigaṭṭidimi nīgu nubeṁdrum̐ḍā mā
vŏḍalibai sŏmmu nīvĕ ubeṁdrum̐ḍā

(||vŏddi||)
voḍam̐ gaṭṭinadūlamavai ubeṁdrum̐ḍā nīgu
nūḍigālu sesemu ubeṁdrum̐ḍā
voḍagumī radigeli nubeṁdrum̐ḍā yiṁta
nūḍadu nī nā laṁkĕ ubeṁdrum̐ḍā

(||vŏddi||)
vŏllane nannum̐ gūḍidi ubeṁdrum̐ḍā nā
vullamulo nīve kāvā ubeṁdrum̐ḍā
vullanabu śhrīveṁkaḍa ubeṁdrum̐ḍā yimmā
vullunugu tenĕmovi ubeṁdrum̐ḍā