వొద్దనేమా నిన్ను నేము వూరకే యేల లోఁగేవు
(॥పల్లవి॥)
వొద్దనేమా నిన్ను నేము వూరకే యేల లోఁగేవు
బుద్దులెల్లా నేరిపి బుజ్జగించరాదా
(॥వొద్ద॥)
నీ మొగము చూచి చెలి నిలువెల్లాఁ జెమరించె
వేమరు సురటిఁ గొని విసరరాదా
చేముట్టి నీకు మొక్కి చిత్తమెల్లాఁ గరఁగెను
ఆమని నీమోవియిచ్చి అలపార్చరాదా
(॥వొద్ద॥)
సన్నలనే మాటలాడి సతి పరవశమందె
చన్నులపైఁ బన్నీరు చల్లఁగరాదా
నిన్నుఁ గొల్చి తానుండి నిట్టూరూపులు నించె
వున్నతిఁ గాఁగిటఁ గూడి వూరడించరాదా
(॥వొద్ద॥)
సెలవుల యింతి నవ్వి సిగ్గులలో నోలలాడీ
పిలిచి నీతొడమీఁదఁ బెట్టుకోరాదా
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
లలి రతులెల్లా నేర్పి లాలించరాదా
(||pallavi||)
vŏddanemā ninnu nemu vūrage yela lom̐gevu
buddulĕllā neribi bujjagiṁcharādā
(||vŏdda||)
nī mŏgamu sūsi sĕli niluvĕllām̐ jĕmariṁchĕ
vemaru suraḍim̐ gŏni visararādā
semuṭṭi nīgu mŏkki sittamĕllām̐ garam̐gĕnu
āmani nīmoviyichchi alabārsarādā
(||vŏdda||)
sannalane māḍalāḍi sadi paravaśhamaṁdĕ
sannulabaim̐ bannīru sallam̐garādā
ninnum̐ gŏlsi tānuṁḍi niṭṭūrūbulu niṁchĕ
vunnadim̐ gām̐giḍam̐ gūḍi vūraḍiṁcharādā
(||vŏdda||)
sĕlavula yiṁti navvi siggulalo nolalāḍī
pilisi nīdŏḍamīm̐dam̐ bĕṭṭugorādā
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
lali radulĕllā nerbi lāliṁcharādā