వొద్దఁ గూచుండఁ గదవే వొడి వట్టి తీసీని
(॥పల్లవి॥)
వొద్దఁ గూచుండఁ గదవే వొడి వట్టి తీసీని
గద్దించి సొలతురా కాంతునితోను
(॥వొద్దఁ॥)
చెలువుఁ డేమిసేసినా చేతికి లోనౌట గాక
చలము సాదింతురా సారె సారెకు
పిలిచి మాటాడితేను ప్రియము చెప్పుట గాక
బలిమిఁ బెనఁగుదురా పంతముతోను
(॥వొద్దఁ॥)
జఱశాతఁ డేమనినా సమ్మతించుట గాక
కఱకఱిఁ బెట్టుదురా కాఁతాళానను
పఱపు పైకి రమ్మంటే బత్తి సేయుదురు గాక
వెఱగుతో బంకింతురా వేసటతోను
(॥వొద్దఁ॥)
శ్రీవేంకటేశుఁ డేలితే చేకొని మెచ్చుట గాక
యీవలిమోమోడుదురా ఇంతసిగ్గుతో
వేవేగ నవ్వఁగాను వేడుకపడుటగాక
పూవులచెండునఁ గొని పొంచిపొంచి వేతురా
(||pallavi||)
vŏddam̐ gūsuṁḍam̐ gadave vŏḍi vaṭṭi tīsīni
gaddiṁchi sŏladurā kāṁtunidonu
(||vŏddam̐||)
sĕluvum̐ ḍemisesinā sedigi lonauḍa gāga
salamu sādiṁturā sārĕ sārĕgu
pilisi māḍāḍidenu priyamu sĕppuḍa gāga
balimim̐ bĕnam̐gudurā paṁtamudonu
(||vŏddam̐||)
jaṟaśhādam̐ ḍemaninā sammadiṁchuḍa gāga
kaṟagaṟim̐ bĕṭṭudurā kām̐tāḽānanu
paṟabu paigi rammaṁṭe batti seyuduru gāga
vĕṟagudo baṁkiṁturā vesaḍadonu
(||vŏddam̐||)
śhrīveṁkaḍeśhum̐ ḍelide segŏni mĕchchuḍa gāga
yīvalimomoḍudurā iṁtasiggudo
vevega navvam̐gānu veḍugabaḍuḍagāga
pūvulasĕṁḍunam̐ gŏni pŏṁchibŏṁchi vedurā