Vivegimchugonavayyaa vimtavimta laagulu

వివేకించుకొనవయ్యా వింతవింత లాగులు
Language

(॥పల్లవి॥)
వివేకించుకొనవయ్యా వింతవింత లాగులు
కవగూడిన గుట్టిది గర్వానకా

(॥॥)
చెలి బొమ్మల జంకెన సింగారాన కింతేకాక
చలములు నీతోడ సాదించుటకా
మొలచినచిరునవ్వు మురిపేన కింతేకాక
సొలసిన కోపము చూపుటకా

(॥॥)
అంగననివ్వెరగులు అణఁకువ కింతేకాక
పంగించి నీతో సరిపంతమునకా
ముంగినిట్టూర్పులు మోహమున కింతేకాక
వెంగెములు నీమై భావించి సోదించుటకా

(॥॥)
వనితచెనకులెల్లా వలపించుటకుఁ గాక
కినిసి నిన్నింతలోనే గెలుచుటకా
యెనసె నీకె శ్రీవేంకటేశ నీచనవే కాక
అనుఁగురతుల నిన్నలయంచుటకా

(||pallavi||)
vivegiṁchugŏnavayyā viṁtaviṁta lāgulu
kavagūḍina guṭṭidi garvānagā

(||||)
sĕli bŏmmala jaṁkĕna siṁgārāna kiṁtegāga
salamulu nīdoḍa sādiṁchuḍagā
mŏlasinasirunavvu muribena kiṁtegāga
sŏlasina kobamu sūbuḍagā

(||||)
aṁgananivvĕragulu aṇam̐kuva kiṁtegāga
paṁgiṁchi nīdo saribaṁtamunagā
muṁginiṭṭūrbulu mohamuna kiṁtegāga
vĕṁgĕmulu nīmai bhāviṁchi sodiṁchuḍagā

(||||)
vanidasĕnagulĕllā valabiṁchuḍagum̐ gāga
kinisi ninniṁtalone gĕlusuḍagā
yĕnasĕ nīgĕ śhrīveṁkaḍeśha nīsanave kāga
anum̐guradula ninnalayaṁchuḍagā