వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు
(॥పల్లవి॥)
వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు
భవసంపదల పెద్దపౌఁజు చూచీ జీవుఁడు
(॥వివే॥)
చిత్తమనియెడి మహాసింహాసనం బెక్కి
హత్తి బహుపరాకాయ నదె జీవుఁడు
గుత్తపు దేహమనేటి కొలువుకూటములోన
జొత్తుఁ బ్రకృతినాట్యము చూచీని జీవుఁడు
(॥వివే॥)
పంచేంద్రియములనే బలుతేజీలపై నెక్కి
అంచల వయ్యాళి దోలీనదె జీవుఁడు
ముంచిన కర్మములనే ముద్రల పెట్టెలు దెచ్చి
సంచముగా లెక్కవెట్టి సరిదాఁచీ జీవుఁడు
(॥వివే॥)
యిచ్చఁ గామక్రోధాలనే హితమంత్రులునుఁ దారు
తచ్చి తలపోసుకొనీఁ దగ జీవుఁడు
అచ్చపు శ్రీవేంకటేశుఁ డంతరాత్మయై యుండఁగా
పచ్చిగా నాతనిఁ జూచి భ్రమసీని జీవుఁడు
(||pallavi||)
vivegiṁcha veḽa ledu vijñānamārgamaṁdu
bhavasaṁpadala pĕddabaum̐ju sūsī jīvum̐ḍu
(||vive||)
sittamaniyĕḍi mahāsiṁhāsanaṁ bĕkki
hatti bahubarāgāya nadĕ jīvum̐ḍu
guttabu dehamaneḍi kŏluvugūḍamulona
jŏttum̐ brakṛtināṭyamu sūsīni jīvum̐ḍu
(||vive||)
paṁcheṁdriyamulane baludejīlabai nĕkki
aṁchala vayyāḽi dolīnadĕ jīvum̐ḍu
muṁchina karmamulane mudrala pĕṭṭĕlu dĕchchi
saṁchamugā lĕkkavĕṭṭi saridām̐sī jīvum̐ḍu
(||vive||)
yichcham̐ gāmakrodhālane hidamaṁtrulunum̐ dāru
tachchi talabosugŏnīm̐ daga jīvum̐ḍu
achchabu śhrīveṁkaḍeśhum̐ ḍaṁtarātmayai yuṁḍam̐gā
pachchigā nādanim̐ jūsi bhramasīni jīvum̐ḍu