వివరించి చూడఁబోతే వెఱఁగయ్యీ నాకు నేఁడు
(॥పల్లవి॥)
వివరించి చూడఁబోతే వెఱఁగయ్యీ నాకు నేఁడు
తవిరి పుట్టనినాఁడు తనువు లెందుండెనో
(॥విపరించి॥)
జనని గర్భములోని సరినే నుండే నాఁడు
యేనసి యోడ నుండెనో యీ యాస
మునుప నంతకు తొల్లి మునిఁగి పరలోకము
కొనలనుండెడినాఁడు కోపము లెందుండెనో
(॥విపరించి॥)
పొత్తులలోపల నేను పొడలు పెట్టేనాఁడు
యిత్తల జవ్వనమద మెందుండెనో
నిత్తెము నిదురలోన నేఁగలలు గనేనాఁడు
యెత్తి యీ కాఁపురము లివి యెందు నుండెనో
(॥విపరించి॥)
మానక పంచేంద్రియమత్తుఁడనై వున్నానాఁడు
యీ నేటి బ్రహ్మానంద మెందుండెనో
తానే శ్రీ వేంకటేశుఁడు దయఁ జూచెఁ గాక నన్ను
ఆనుకొన్నకర్మము యేమంటాఁ దా నుండెనో
(||pallavi||)
vivariṁchi sūḍam̐bode vĕṟam̐gayyī nāgu nem̐ḍu
taviri puṭṭaninām̐ḍu tanuvu lĕṁduṁḍĕno
(||vibariṁchi||)
janani garbhamuloni sarine nuṁḍe nām̐ḍu
yenasi yoḍa nuṁḍĕno yī yāsa
munuba naṁtagu tŏlli munim̐gi paralogamu
kŏnalanuṁḍĕḍinām̐ḍu kobamu lĕṁduṁḍĕno
(||vibariṁchi||)
pŏttulalobala nenu pŏḍalu pĕṭṭenām̐ḍu
yittala javvanamada mĕṁduṁḍĕno
nittĕmu niduralona nem̐galalu ganenām̐ḍu
yĕtti yī kām̐puramu livi yĕṁdu nuṁḍĕno
(||vibariṁchi||)
mānaga paṁcheṁdriyamattum̐ḍanai vunnānām̐ḍu
yī neḍi brahmānaṁda mĕṁduṁḍĕno
tāne śhrī veṁkaḍeśhum̐ḍu dayam̐ jūsĕm̐ gāga nannu
ānugŏnnagarmamu yemaṁṭām̐ dā nuṁḍĕno