Vivarimchi sepparaadu vere neegu daamsaraadu

వివరించి చెప్పరాదు వేరే నీకు దాఁచరాదు
Language

(॥పల్లవి॥)
వివరించి చెప్పరాదు వేరే నీకు దాఁచరాదు
జవకట్టి వున్నవి మీ జాణతనాలు

(॥వివ॥)
చిడుముడి మాటలలోఁ జిందీ నిన్న మొన్నటి-
కడువిరహములోనికాఁతాళలు
గుడిగొన్ననిట్టూర్పులఁ గుమ్మరించీ నీమీఁద
తడఁబడ్డతనలోనితలపోఁతలు

(॥వివ॥)
సొలపుఁ జూపులవెంట జొబ్బిలీని యేకతపు-
టలుకలఁ గొసరేటియందచందాలు
కులికి చెమటనీటఁ గురిసీ నీయెదుటను
చలివేఁడి వలపుల జడివానలు

(॥వివ॥)
మొలకనవ్వులలోనే ముంచీ నీవు గూడిన-
పలురతులలోపలి భావ భేదాలు
యెలమి శ్రీవేంకటేశ యేలిననీకే తెలుసు
తలకొన్న జవ్వనపుతమకములు

(||pallavi||)
vivariṁchi sĕpparādu vere nīgu dām̐sarādu
javagaṭṭi vunnavi mī jāṇadanālu

(||viva||)
siḍumuḍi māḍalalom̐ jiṁdī ninna mŏnnaḍi-
kaḍuvirahamulonigām̐tāḽalu
guḍigŏnnaniṭṭūrbulam̐ gummariṁchī nīmīm̐da
taḍam̐baḍḍadanalonidalabom̐talu

(||viva||)
sŏlabum̐ jūbulavĕṁṭa jŏbbilīni yegadabu-
ṭalugalam̐ gŏsareḍiyaṁdasaṁdālu
kuligi sĕmaḍanīḍam̐ gurisī nīyĕduḍanu
salivem̐ḍi valabula jaḍivānalu

(||viva||)
mŏlaganavvulalone muṁchī nīvu gūḍina-
paluradulalobali bhāva bhedālu
yĕlami śhrīveṁkaḍeśha yelinanīge tĕlusu
talagŏnna javvanabudamagamulu