వివా(చా?)రించుకొమ్మననే విభునిఁ దనలోఁ దానె
(॥పల్లవి॥)
వివా(చా?)రించుకొమ్మననే విభునిఁ దనలోఁ దానె
పచారించితే వలపు పైపైనే వున్నది
(॥విచా॥)
మెక్కలీఁడైనవాఁడు మోహములు చల్లితేను
వెక్కసములై మించదు వెలఁదికిని
చొక్కి వినయపు సతి సొలపుల దిట్టితేను
అక్కర గలుగు పతి కమృతమై తోఁచును
(॥విచా॥)
పల్లదీఁ డైనవాఁడు పచ్చిమాటలాడితేను
వుల్లములో నుండి(డు?) కెత్త దివిదకును
మెల్లనే నయగారైనమెలుఁత వెంగెమాడితే
చల్లఁగా నాయకునికి చవులై పరగును
(॥విచా॥)
కాతరీఁడైనవాఁడు కన్నులను మొక్కితేను
ఘాతలై వేసరించవు కామినికిని
యీతల శ్రీ వేంకటేశుఁ డీతఁ డిట్టె నన్నుఁగూడె
రాతిరి బగలు నాకు రతికెక్కె ముదము
(||pallavi||)
vivā(sā?)riṁchugŏmmanane vibhunim̐ danalom̐ dānĕ
pasāriṁchide valabu paibaine vunnadi
(||visā||)
mĕkkalīm̐ḍainavām̐ḍu mohamulu sallidenu
vĕkkasamulai miṁchadu vĕlam̐digini
sŏkki vinayabu sadi sŏlabula diṭṭidenu
akkara galugu padi kamṛtamai tom̐sunu
(||visā||)
palladīm̐ ḍainavām̐ḍu pachchimāḍalāḍidenu
vullamulo nuṁḍi(ḍu?) kĕtta dividagunu
mĕllane nayagārainamĕlum̐ta vĕṁgĕmāḍide
sallam̐gā nāyagunigi savulai paragunu
(||visā||)
kādarīm̐ḍainavām̐ḍu kannulanu mŏkkidenu
ghādalai vesariṁchavu kāminigini
yīdala śhrī veṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
rādiri bagalu nāgu radigĕkkĕ mudamu