Visigevu summee neevu viduvanamtaa naabai

విసిగేవు సుమ్మీ నీవు విడువనంటా నాపై
Language

(॥పల్లవి॥)
విసిగేవు సుమ్మీ నీవు విడువనంటా నాపై
వసమైన దానఁ గాన వదల నే నిన్నును

(॥॥)
యీడా నాడా నుండి నన్ను నెంత విచారించకున్నా
నాడుకొందు నేను నీ యాల నంటాను
వోడక యిట్టే నీవు వొద్దికిఁ బిలువకున్నా
తోడునీడనై వుందు తొలఁగి పో నెపుడు

(॥॥)
మొగము చూచి నీవు మోనాన నట్టే వుంటే
నగుదు నూరకయైన నప్పుసేసుక
వొగరుఁ దీపుగా నీవు వోరగండ్లఁ జూచిన
మగటిమిఁ బూసగొండిమాట లెల్లా నాడుదూ

(॥॥)
అంతలో నీవు విచ్చేసి ఆయములు ముట్టి తేను
సంతసాన నీ మోవి చవిగొందును
కాంతుఁడ శ్రీ వేంకటేశ కలసితి విట్టె నన్ను
పంతాన నిందుకే నిన్నుఁ బలుమారు మెత్తును.

(||pallavi||)
visigevu summī nīvu viḍuvanaṁṭā nābai
vasamaina dānam̐ gāna vadala ne ninnunu

(||||)
yīḍā nāḍā nuṁḍi nannu nĕṁta visāriṁchagunnā
nāḍugŏṁdu nenu nī yāla naṁṭānu
voḍaga yiṭṭe nīvu vŏddigim̐ biluvagunnā
toḍunīḍanai vuṁdu tŏlam̐gi po nĕbuḍu

(||||)
mŏgamu sūsi nīvu monāna naṭṭe vuṁṭe
nagudu nūragayaina nappusesuga
vŏgarum̐ dībugā nīvu voragaṁḍlam̐ jūsina
magaḍimim̐ būsagŏṁḍimāḍa lĕllā nāḍudū

(||||)
aṁtalo nīvu vichchesi āyamulu muṭṭi tenu
saṁtasāna nī movi savigŏṁdunu
kāṁtum̐ḍa śhrī veṁkaḍeśha kalasidi viṭṭĕ nannu
paṁtāna niṁduge ninnum̐ balumāru mĕttunu.