విచారించుకోవుగాక వేడుకకాఁడవు నీవు
(॥పల్లవి॥)
విచారించుకోవుగాక వేడుకకాఁడవు నీవు
పచారించఁ బోతేను నీపై నిట్టె మోవదా
(॥విచా॥)
సొలసి మాటలాడేటి సుదతిని విభుఁడవు
పలుకులలో నెగ్గులు పట్టఁదగునా
వలపించితి వాకెను వద్దనుండనినేరమి
నెలకొని వెదకితే నీ వొళ్లిదే కాదా
(॥విచా॥)
కొసరి చేతులు చాఁచే కోమలిచేఁతలకుఁగా
యెసఁగ వాసులువంతు లెంచవచ్చునా
వెసఁ బెండ్లాడితి వేవేల కోర్వకుండితే
అసుదుగా నిన్నె దూరి అందరూను నాడరా
(॥విచా॥)
కందువ నిన్నుఁగూడిన కాంతను శ్రీ వేంకటేశ
పొందుల రతులయలపులు చూతురా
సందడిఁ బెనఁగితివి సారె మెచ్చకమానితే
కిందటి పనులకు నీకె దయవుట్టదా
(||pallavi||)
visāriṁchugovugāga veḍugagām̐ḍavu nīvu
pasāriṁcham̐ bodenu nībai niṭṭĕ movadā
(||visā||)
sŏlasi māḍalāḍeḍi sudadini vibhum̐ḍavu
palugulalo nĕggulu paṭṭam̐dagunā
valabiṁchidi vāgĕnu vaddanuṁḍaninerami
nĕlagŏni vĕdagide nī vŏḽlide kādā
(||visā||)
kŏsari sedulu sām̐se komalisem̐talagum̐gā
yĕsam̐ga vāsuluvaṁtu lĕṁchavachchunā
vĕsam̐ bĕṁḍlāḍidi vevela korvaguṁḍide
asudugā ninnĕ dūri aṁdarūnu nāḍarā
(||visā||)
kaṁduva ninnum̐gūḍina kāṁtanu śhrī veṁkaḍeśha
pŏṁdula radulayalabulu sūdurā
saṁdaḍim̐ bĕnam̐gidivi sārĕ mĕchchagamānide
kiṁdaḍi panulagu nīgĕ dayavuṭṭadā