Visaarimchugovu gaaga venagamumdu

విచారించుకోవు గాక వెనకముందు
Language

(॥పల్లవి॥)
విచారించుకోవు గాక వెనకముందు
పచారాలవలె బట్టఁబయట బెట్టుదురా

(॥విచా॥)
చెనకుచు మగవాఁడు సిగ్గువిడువఁగఁ జెల్లు
అనిశము విడువరా దాఁటదానికి
చనుఁగవ చూపుమంటా సారెసారెఁ దిట్టేవు
మొనలైవుండును అవి ముట్టితేనే నాఁటవా

(॥విచా॥)
కన్నచోటఁ బతులకు కడుఁ దమకించఁ జెల్లు
అన్నిటాను అణకువే ఆఁటదానికి
వన్నెలమోవి ఇమ్మంటా వచ్చి వచ్చి జంకించేవు
నున్నవై వుండును అది నోరూరింపించదా

(॥విచా॥)
యీడానాడా నినుబోఁటి కెమ్మెలాడుకోఁ జెల్లు
ఆడికెఁ బడఁగరాదు ఆఁటదానికి
కూడితివి రతి నన్ను గొబ్బున శ్రీ వేంకటేశ
వాడికై వుండును అది వ(ద)లపులు రేఁచవా

(||pallavi||)
visāriṁchugovu gāga vĕnagamuṁdu
pasārālavalĕ baṭṭam̐bayaḍa bĕṭṭudurā

(||visā||)
sĕnagusu magavām̐ḍu sigguviḍuvam̐gam̐ jĕllu
aniśhamu viḍuvarā dām̐ṭadānigi
sanum̐gava sūbumaṁṭā sārĕsārĕm̐ diṭṭevu
mŏnalaivuṁḍunu avi muṭṭidene nām̐ṭavā

(||visā||)
kannasoḍam̐ badulagu kaḍum̐ damagiṁcham̐ jĕllu
anniḍānu aṇaguve ām̐ṭadānigi
vannĕlamovi immaṁṭā vachchi vachchi jaṁkiṁchevu
nunnavai vuṁḍunu adi norūriṁpiṁchadā

(||visā||)
yīḍānāḍā ninubom̐ṭi kĕmmĕlāḍugom̐ jĕllu
āḍigĕm̐ baḍam̐garādu ām̐ṭadānigi
kūḍidivi radi nannu gŏbbuna śhrī veṁkaḍeśha
vāḍigai vuṁḍunu adi va(da)labulu rem̐savā