విచారించుకోనివారి వెఱ్ఱితన మింతె కాని
(॥పల్లవి॥)
విచారించుకోనివారి వెఱ్ఱితన మింతె కాని
పచారించి నీ కృపను బ్రతికితి నేను
(॥విచా॥)
శ్రీ మహలక్ష్మి యుండఁ బొంచి దరిద్రమేలయుండు
కామధేను వున్నచోట కరవేల యుండు
కామించి నారాయణ నీ ఘననామ మున్నచోట
తామసాలుఁ బాతకాలు దగ్గరి యేల యుండు
(॥విచా॥)
చెంగట సూర్యుఁ డున్నచో చీఁకట్లేల యుండు
భంగించి గరుఁడుడుండఁ బాము లేల యుండు
ముంగిట గోవిందుఁడ నీ ముద్రలు మేన నుండఁగా
అంగవికారములయిన అజ్ఞాన మేల యుండు
(॥విచా॥)
తానే నిజమై వున్న చెంతఁ జంచల మేలయుండు
కానఁబడి భక్తి యుండ కలఁక యేల యుండు
ఔ నవు శ్రీ వేంకటేశ అంతరాత్మ నీ వున్నచో
ఆనుక శుభము లుండ నల పేల యుండు
(||pallavi||)
visāriṁchugonivāri vĕṭridana miṁtĕ kāni
pasāriṁchi nī kṛpanu bradigidi nenu
(||visā||)
śhrī mahalakṣhmi yuṁḍam̐ bŏṁchi daridramelayuṁḍu
kāmadhenu vunnasoḍa karavela yuṁḍu
kāmiṁchi nārāyaṇa nī ghananāma munnasoḍa
tāmasālum̐ bādagālu daggari yela yuṁḍu
(||visā||)
sĕṁgaḍa sūryum̐ ḍunnaso sīm̐kaṭlela yuṁḍu
bhaṁgiṁchi garum̐ḍuḍuṁḍam̐ bāmu lela yuṁḍu
muṁgiḍa goviṁdum̐ḍa nī mudralu mena nuṁḍam̐gā
aṁgavigāramulayina ajñāna mela yuṁḍu
(||visā||)
tāne nijamai vunna sĕṁtam̐ jaṁchala melayuṁḍu
kānam̐baḍi bhakti yuṁḍa kalam̐ka yela yuṁḍu
au navu śhrī veṁkaḍeśha aṁtarātma nī vunnaso
ānuga śhubhamu luṁḍa nala pela yuṁḍu