Visaarimchugonevaari vetridana mimtegaaga

విచారించుకొనేవారి వెఱ్ఱితన మింతేకాక
Language

(॥పల్లవి॥)
విచారించుకొనేవారి వెఱ్ఱితన మింతేకాక
యెచట బంగారుతోడ యినుము సరి యౌనా

(॥విచారి॥)
బహు జన సమ్మతపు పనులే యీడేరుఁ గాక
మహికి వేఁగైన పని మనఁబోయీనా
విహితపు టగ్రపూజ విష్ణునికి చెల్లెఁగాక
సహజపు శిశుపాలు చలములు చెల్లెనా

(॥విచారి॥)
సర్వజన హితుఁడైన జనుఁడే వర్ధిల్లుఁ గాక
గర్వియైన కంటకుఁడు కడతేరీనా
పూర్వమందు ధర్మజుఁడు భూమికి రాజాయెఁ గాక
నిర్వహించి కౌరవుఁడు నెరవేరెనా

(॥విచారి॥)
పొందుగాఁ జేసినయట్టి పుణ్యమే మే లిచ్చుఁగాక
కందుకొన్నపాపము సుఖము నిచ్చీనా
చెంది శ్రీ వేంకటేశ్వరు సేవించి గెల్చెఁ బ్రహ్మాదుఁ
డిందరిలోన హిరణ్యుఁ డీడేరఁ గలిగెనా

(||pallavi||)
visāriṁchugŏnevāri vĕṭridana miṁtegāga
yĕsaḍa baṁgārudoḍa yinumu sari yaunā

(||visāri||)
bahu jana sammadabu panule yīḍerum̐ gāga
mahigi vem̐gaina pani manam̐boyīnā
vihidabu ṭagrabūja viṣhṇunigi sĕllĕm̐gāga
sahajabu śhiśhubālu salamulu sĕllĕnā

(||visāri||)
sarvajana hidum̐ḍaina janum̐ḍe vardhillum̐ gāga
garviyaina kaṁṭagum̐ḍu kaḍaderīnā
pūrvamaṁdu dharmajum̐ḍu bhūmigi rājāyĕm̐ gāga
nirvahiṁchi kauravum̐ḍu nĕraverĕnā

(||visāri||)
pŏṁdugām̐ jesinayaṭṭi puṇyame me lichchum̐gāga
kaṁdugŏnnabābamu sukhamu nichchīnā
sĕṁdi śhrī veṁkaḍeśhvaru seviṁchi gĕlsĕm̐ brahmādum̐
ḍiṁdarilona hiraṇyum̐ ḍīḍeram̐ galigĕnā