విచారించు హరి నావిన్నప మవధరించు
(॥పల్లవి॥)
విచారించు హరి నావిన్నప మవధరించు
పచారమే నాది గాని పనులెల్లా నీవే
(॥విచా॥)
తనువు నా దెందుఁ గాని తనువులో నింద్రియములు
అనిశము నాచెప్పినట్టు సేయవు
మనసు నాదెందుఁ గాని మర్మము నాయిచ్చ రాదు
పనివడి దూరు నాది పరులదే భోగము
(॥విచా॥)
అలరి నానిద్దుర నాదెందుఁ గాని సుఖమెల్ల
కలలోని కాఁపిరాలకతల పాలె
తెలివి నాదెందుఁ గాని దినాలు కాలము సొమ్ము
యెలమిఁ బేరు నాది యెవ్వరిదో బలువు
(॥విచా॥)
కర్మము నాదెందుఁ గాని కర్మములో ఫలమెల్ల
అర్మిలి నాజన్మముల ఆధీనమె
ధర్మపు శ్రీవేంకటేశ దయానిధివి నీవు
నిర్మితము నీదింతే నేరుపు నీమాయది
(||pallavi||)
visāriṁchu hari nāvinnaba mavadhariṁchu
pasārame nādi gāni panulĕllā nīve
(||visā||)
tanuvu nā dĕṁdum̐ gāni tanuvulo niṁdriyamulu
aniśhamu nāsĕppinaṭṭu seyavu
manasu nādĕṁdum̐ gāni marmamu nāyichcha rādu
panivaḍi dūru nādi parulade bhogamu
(||visā||)
alari nāniddura nādĕṁdum̐ gāni sukhamĕlla
kalaloni kām̐pirālagadala pālĕ
tĕlivi nādĕṁdum̐ gāni dinālu kālamu sŏmmu
yĕlamim̐ beru nādi yĕvvarido baluvu
(||visā||)
karmamu nādĕṁdum̐ gāni karmamulo phalamĕlla
armili nājanmamula ādhīnamĕ
dharmabu śhrīveṁkaḍeśha dayānidhivi nīvu
nirmidamu nīdiṁte nerubu nīmāyadi