Visaarimchavale naagu vedugagattevu neevu

విచారించవలె నాకు వేడుకకత్తెవు నీవు
Language

(॥పల్లవి॥)
విచారించవలె నాకు వేడుకకత్తెవు నీవు
పచారించి యతనిఁ జేపట్టవు గదా

(॥॥)
చెక్కులవెంట నేలే చెమట గారీ
తెక్కులఁ గన్నుల నేలే తేటలు వారీ
యెక్కడనుండి వచ్చేవే యింతిరో నీవు
మక్కువ నామగనితో మాఁటాడవు గదా

(॥॥)
యెన్నఁగ నీపోఁకముడి యేల వీడీ
వన్నెలఁ గెమ్మోవి యాల వసివాడీ
చెన్నుమీర రతి యెందుఁ జేసి వచ్చేవే
అన్నిటా నారమణుని నంటవుగదా

(॥॥)
చాలై మేనఁబులకససులు నిండీ
మేలు నీమేనివలపు మిక్కిలి పండీ
ఆలకించి యెవ్వరిఁ బెండ్లాడి వచ్చేవే
యేలిననా శ్రీ వేంకటేశుఁ గూడవుగదా

(||pallavi||)
visāriṁchavalĕ nāgu veḍugagattĕvu nīvu
pasāriṁchi yadanim̐ jebaṭṭavu gadā

(||||)
sĕkkulavĕṁṭa nele sĕmaḍa gārī
tĕkkulam̐ gannula nele teḍalu vārī
yĕkkaḍanuṁḍi vachcheve yiṁtiro nīvu
makkuva nāmaganido mām̐ṭāḍavu gadā

(||||)
yĕnnam̐ga nībom̐kamuḍi yela vīḍī
vannĕlam̐ gĕmmovi yāla vasivāḍī
sĕnnumīra radi yĕṁdum̐ jesi vachcheve
anniḍā nāramaṇuni naṁṭavugadā

(||||)
sālai menam̐bulagasasulu niṁḍī
melu nīmenivalabu mikkili paṁḍī
ālagiṁchi yĕvvarim̐ bĕṁḍlāḍi vachcheve
yelinanā śhrī veṁkaḍeśhum̐ gūḍavugadā