విచారించవద్దు మరి విన్నపాలుఁ జేయ నేను
(॥పల్లవి॥)
విచారించవద్దు మరి విన్నపాలుఁ జేయ నేను
పచారించి రమ్మనవే బత్తి సేసే గాని
(॥॥)
తత్తరించి దూరనే తనతో నలుగనే
చిత్తము రాఁదన సేవ సేసేఁ గాని
కొత్తలేమిఁ జేయనే కొసరి జంకించనే
హత్తి తన యిచ్చలోనే అలరేఁ గాని
(॥॥)
వేసారించి సొలయనే వేమారు నలయించనే
నాసూటినే తనతోను నవ్వేఁ గాని
ఆసల భ్రమయించనే అఱడి నేఁ బెట్ట నే
బాసికము గట్టి తలఁ బాలు వోసేఁ గాని
(॥॥)
చలము సాదించనే చండి సేసి పెనఁగనే
నెలకొని కౌఁగిటిలో నించేఁ గాని
అలరి శ్రీ వేంకటేశుఁ డంతలోనే నన్నుఁగూడె
బలిమి సేయనే తన్నుఁ బాయకుండేఁ గాని
(||pallavi||)
visāriṁchavaddu mari vinnabālum̐ jeya nenu
pasāriṁchi rammanave batti sese gāni
(||||)
tattariṁchi dūrane tanado nalugane
sittamu rām̐dana seva sesem̐ gāni
kŏttalemim̐ jeyane kŏsari jaṁkiṁchane
hatti tana yichchalone alarem̐ gāni
(||||)
vesāriṁchi sŏlayane vemāru nalayiṁchane
nāsūḍine tanadonu navvem̐ gāni
āsala bhramayiṁchane aṟaḍi nem̐ bĕṭṭa ne
bāsigamu gaṭṭi talam̐ bālu vosem̐ gāni
(||||)
salamu sādiṁchane saṁḍi sesi pĕnam̐gane
nĕlagŏni kaum̐giḍilo niṁchem̐ gāni
alari śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalone nannum̐gūḍĕ
balimi seyane tannum̐ bāyaguṁḍem̐ gāni