Visaarabarulaala vivegulaala

విచారపరులాల వివేకులాల
Language

(॥పల్లవి॥)
విచారపరులాల వివేకులాల
పచరించి తెలిసి యా పగిది నడువుఁడీ

(॥విచార॥)
చేసినపుణ్యమువల్ల చెలఁగి దేవత లైరి
ఆసరిఁ బాపమువల్ల నసుర లైరి
దాసరితనమువల్లఁ దగ నారదాదులైరి
వాసి నిందెవ్వ రెక్కుడొ వడి నెంచు కొనుఁడీ

(॥విచార॥)
ఘనరాజసగుణాన కలుగు నిహలోకము
అనిశముఁ దామసాన నధోగతి
మొనసి సాత్త్వికమున మోక్షము సిద్ధించు
ననుపమ పదమేదొ అది యెంచుకొనుఁడీ

(॥విచార॥)
పరగ దేహమూలము ప్రాకృతమయిన మాయ
అరాసి యాత్మ నీడేర్చు నలమేల్మంగ
సిరుల నంతర్యామి శ్రీవేంకటేశ్వరుఁడు
సరి నిందు మీ బ్రదుకుజాడ యెంచుకొనుఁడీ

(||pallavi||)
visārabarulāla vivegulāla
pasariṁchi tĕlisi yā pagidi naḍuvum̐ḍī

(||visāra||)
sesinabuṇyamuvalla sĕlam̐gi devada lairi
āsarim̐ bābamuvalla nasura lairi
dāsaridanamuvallam̐ daga nāradādulairi
vāsi niṁdĕvva rĕkkuḍŏ vaḍi nĕṁchu kŏnum̐ḍī

(||visāra||)
ghanarājasaguṇāna kalugu nihalogamu
aniśhamum̐ dāmasāna nadhogadi
mŏnasi sāttvigamuna mokṣhamu siddhiṁchu
nanubama padamedŏ adi yĕṁchugŏnum̐ḍī

(||visāra||)
paraga dehamūlamu prākṛtamayina māya
arāsi yātma nīḍersu nalamelmaṁga
sirula naṁtaryāmi śhrīveṁkaḍeśhvarum̐ḍu
sari niṁdu mī bradugujāḍa yĕṁchugŏnum̐ḍī