విరులదండలతోడి విట్ఠలేశా । నీవు
(॥పల్లవి॥)
విరులదండలతోడి విట్ఠలేశా । నీవు
యెరవులేనివాఁడవు యెపుడు విట్ఠలేశా
(॥విరు॥)
విచ్చేయు మా ఇంటికి విట్ఠలేశా । నీకు
విచ్చనవిడాయ నిది విట్ఠలేశా
విచ్చి చెప్పే నిటు నీకు విట్ఠలేశా । నాకు
నిచ్చినబాస దప్పకు మిఁక విట్ఠలేశా
(॥విరు॥)
వీడె మియ్యఁగదవోయి విట్ఠలేశా । కడు-
వేడుకకాఁడవు నీవు విట్ఠలేశా
వీడుజోడాయ వలు విట్ఠలేశా
పాడిఁ బంతాలెల్లఁ జెల్లె బాపు విట్ఠలేశా
(॥విరు॥)
విడిచేవు పోఁకముడి విట్ఠలేశా । యెంత
వెడమాయకాఁడవయ్య విట్ఠలేశా
కడఁగి శ్రీవేంకటాద్రిఁ గలసితివి
అడియాలముగ నన్ను నౌఁర విట్ఠలేశా
(||pallavi||)
viruladaṁḍaladoḍi viṭṭhaleśhā | nīvu
yĕravulenivām̐ḍavu yĕbuḍu viṭṭhaleśhā
(||viru||)
vichcheyu mā iṁṭigi viṭṭhaleśhā | nīgu
vichchanaviḍāya nidi viṭṭhaleśhā
vichchi sĕppe niḍu nīgu viṭṭhaleśhā | nāgu
nichchinabāsa dappagu mim̐ka viṭṭhaleśhā
(||viru||)
vīḍĕ miyyam̐gadavoyi viṭṭhaleśhā | kaḍu-
veḍugagām̐ḍavu nīvu viṭṭhaleśhā
vīḍujoḍāya valu viṭṭhaleśhā
pāḍim̐ baṁtālĕllam̐ jĕllĕ bābu viṭṭhaleśhā
(||viru||)
viḍisevu pom̐kamuḍi viṭṭhaleśhā | yĕṁta
vĕḍamāyagām̐ḍavayya viṭṭhaleśhā
kaḍam̐gi śhrīveṁkaḍādrim̐ galasidivi
aḍiyālamuga nannu naum̐ra viṭṭhaleśhā