విరుల యమ్ములు వాఁడి వెన్నెల వేఁడి
(॥పల్లవి॥)
విరుల యమ్ములు వాఁడి వెన్నెల వేఁడి
సరవితోఁ గూడరయ్య జామువోయ నిపుడు
(॥॥)
వుయ్యాల మంచముమీఁద నుండినట్టి నీదిక్కు
తొయ్యలి మేడలో నుండి తొంగిచూచీని
చెయ్యెత్తి సన్న చేసి చేకొని పిలువవయ్య
చయ్యాటపు సిగ్గులనే జామువోయ నిపుడు
(॥॥)
నెలవై మలఁగుమీఁది నీబుజముపై నాపె
కలువకామ సోరణ గండ్లఁ జాఁచీని
చలివాసి రమ్మని ఇచ్చట కప్పణియ్యవయ్య
చలపాది సిగ్గులనే జామువోయ నిపుడు
(॥॥)
చేరి దోమతెరలోని శ్రీవేంకటేశ నిన్ను
గోరనూఁది కాఁగిలించి కొసరీ నాపె
గారవించి యేలితివి గక్కన మోవియ్యవయ్య
సారెకు నొడఁబాట్ల జామువోయ నిపుడు
(||pallavi||)
virula yammulu vām̐ḍi vĕnnĕla vem̐ḍi
saravidom̐ gūḍarayya jāmuvoya nibuḍu
(||||)
vuyyāla maṁchamumīm̐da nuṁḍinaṭṭi nīdikku
tŏyyali meḍalo nuṁḍi tŏṁgisūsīni
sĕyyĕtti sanna sesi segŏni piluvavayya
sayyāḍabu siggulane jāmuvoya nibuḍu
(||||)
nĕlavai malam̐gumīm̐di nībujamubai nābĕ
kaluvagāma soraṇa gaṁḍlam̐ jām̐sīni
salivāsi rammani ichchaḍa kappaṇiyyavayya
salabādi siggulane jāmuvoya nibuḍu
(||||)
seri domadĕraloni śhrīveṁkaḍeśha ninnu
goranūm̐di kām̐giliṁchi kŏsarī nābĕ
gāraviṁchi yelidivi gakkana moviyyavayya
sārĕgu nŏḍam̐bāṭla jāmuvoya nibuḍu