విఱిగినట్టి బండివారు వెఱ్ఱివారు గాక నీ
(॥పల్లవి॥)
విఱిగినట్టి బండివారు వెఱ్ఱివారు గాక నీ-
వెఱిఁగి సతము చేసుకొంటి వేమి సేతువే
(॥విఱిగి॥)
పొలఁతి నీవు అతనిఁ బిలువఁబోయినట్టిపొద్దు లేడ
నిలువుఁ జెమటతోడి యలపు నీ కిదేడదే
వెలుఁగుచేను మేసినట్టి విధము దోఁచె నీయందు
అలసి సొలసి నిన్ను నింక నాడ నేఁటికే
(॥విఱిగి॥)
యింతి నేను విరహమునను యెదురుచూచు టేడ నీవు
వింతపులకగముల విఱ్ఱవీఁగు టేఁటిదే
కంతుసంచకారులోనఁ గల్లఁ దోఁచెనీయందు
మంతనమున నీతోడిమాట లేఁటికే
(॥విఱిగి॥)
వనిత శ్రీవేంకటేశ్వరుఁడు దానె నన్నుఁ గూడె
చనవి మనవి నతనిని సన్న లేఁటికే
తనరి వీఁపు గానరాఁగాఁదాగినట్టి చందమాయ
వెనక నాకుఁ బ్రియము చెప్పి వేఁడ నేటికే
(||pallavi||)
viṟiginaṭṭi baṁḍivāru vĕṭrivāru gāga nī-
vĕṟim̐gi sadamu sesugŏṁṭi vemi seduve
(||viṟigi||)
pŏlam̐ti nīvu adanim̐ biluvam̐boyinaṭṭibŏddu leḍa
niluvum̐ jĕmaḍadoḍi yalabu nī kideḍade
vĕlum̐gusenu mesinaṭṭi vidhamu dom̐sĕ nīyaṁdu
alasi sŏlasi ninnu niṁka nāḍa nem̐ṭige
(||viṟigi||)
yiṁti nenu virahamunanu yĕdurusūsu ṭeḍa nīvu
viṁtabulagagamula viṭravīm̐gu ṭem̐ṭide
kaṁtusaṁchagārulonam̐ gallam̐ dom̐sĕnīyaṁdu
maṁtanamuna nīdoḍimāḍa lem̐ṭige
(||viṟigi||)
vanida śhrīveṁkaḍeśhvarum̐ḍu dānĕ nannum̐ gūḍĕ
sanavi manavi nadanini sanna lem̐ṭige
tanari vīm̐pu gānarām̐gām̐dāginaṭṭi saṁdamāya
vĕnaga nāgum̐ briyamu sĕppi vem̐ḍa neḍige